టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటును జనసేనకి కేటాయించడం ఖాయమన్న చంటిబాబు.. ఆర్థికంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ తనకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతిపాదన పెట్టారట.. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు జనసేనలో కాకినాడ ఎంపీగా పోటీ చేసేవారు ప్రస్తుతానికి ఎవరూ లేరని.. ఎవరు పోటీ చేసిన బయట నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడం తప్పదని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట..
ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడ్డారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని.. ఈ స్కీం కింద భారీ ఎత్తున.. రూ. 35,141 కోట్ల మేర దోపిడీ జరిగిందన్నారు.
నా రాజకీయ భవిష్యత్తు నాశనం కావడానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణం అన్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వచ్చే ఎన్నికల్లో ఎంవీవీని ఓడించడమే నా లక్ష్యం అన్నారు. సంక్రాంతి పండుగ తరువాత నా సత్తా చూపిస్తాను అంటూ సవాల్ చేశారు.
పవన్ కల్యాణ్‌తో సమావేశంపై అనుచరులతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు ఆర్కే.. వైఎస్ షర్మిలతోనే నా రాజకీయ ప్రయాణం అని స్పష్టం చేశారు.. వైఎస్ షర్మిల రాజకీయాలపై తన నిర్ణయం ప్రకటించాక ఆమె వెంటే నడుస్తా అన్నారు.. ఇక, నా నియజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్త చేశారు..
రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లకు ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం.. ఇంటింటికీ రేషన్ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకంగా రూ.750 చెల్లించేందుకు సిద్ధమైంది.