Payyavula Keshav: రాష్ట్రంలో చంద్రబాబు కోసమే స్టార్ కాంపెయినర్లు ఎంట్రీ ఇస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగింది టీడీపీ.. ఉరవకొండ పర్యటనలో సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేయగా.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. సీఎం జగన్ అసరా సమావేశంలో నిధులు విడుదల చేసినట్లు గొప్పగా ప్రకటించారు. ఐదేళ్లలో జిల్లాకు ఎం చేశారో చెబుతాడు అనుకున్నాం. కానీ, చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఓ రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి అంత బలహీనంగా.. తనకు మీడియా లేదు అన్నట్లు సానుభూతి కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పతనం తప్పదు అని తెలిసే బెలగా మాట్లాడుతున్నాడు.. సీఎం నిన్నటి వరకు ప్రతిపక్షాలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో చూశాం.. సీఎం వైఎస్ జగన్ పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు అంటూ పేర్కొన్నారు.
Read Also: Shika Goyal : నకిలీ పాస్ పోర్ట్ కేసులో 12 మంది అరెస్ట్ చేసాం
ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న జనమే మా స్టార్ క్యాంపెయినర్లు అన్నారు పయ్యావుల కేశవ్.. రాయలసీమలో చుక్క నీటి కోసం ఆందోళన చేసిన ప్రతి రైతు స్టార్ క్యాంపెయినరే.. రాష్ట్రంలో 27 పథకాల రద్దుతో నష్టపోయిన రైతులు, 37 పథకాల రద్దుతో నష్టపోయిన బీసీ సోదరులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన మా స్టార్ క్యాంపెయినర్లే అని పేర్కొన్నారు. మోసపోయిన అంగన్వాడీ లు, ప్రభుత్వ ఉద్యోగులు, నష్టపోయిన పోలీసులు కూడా మా స్టార్ క్యాంపెయినర్లే అని తెలిపారు. ఇక, మీ స్టార్ క్యాంపైనర్లంతా దోపిడీలు చేస్తున్న వర్గమే అని దుయ్యబట్టారు. ఉరవకొండకు ఏమైనా చేసింది చెబుతాడా అని అనుకున్నాం.. 80 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అని చెప్పిన సీఎం.. 8 ఎకరాలకు నీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. హంద్రీ నీవాలో తట్టెడు మట్టి తీయలేదు.. బీటీ, పేరూరు ప్రాజెక్ట్ లు, హంద్రీ నీవా 36 ప్యాకేజీ ఏమి చేశారో చూస్తున్నాం అని మండిపడ్డారు.
Read Also: Chinese Army: ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ అంటూ చైనా ఆర్మీ నినాదాలు.. వీడియో వైరల్
రాయలసీమ కు నీళ్లు ఇవ్వటమే ప్రధానం.. ఐదేళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు.. ఇక పరిశ్రమ రాలేదు.. ఒక్క ఎకరా జాతీయ రహదారి రాలేదు అని దుయ్యబట్టారు పయ్యావుల.. విశ్వేశ్వర రెడ్డి మోసానికి నిలువెత్తు రూపం అంటూ స్థానిక వైసీపీ నేతపై విరుచుకుపడ్డారు.. ప్రజలు నీకు ఎన్ని పేర్లు పెట్టారో జనాలను అడిగితే తెలుస్తుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. కాగా, అధికారంలో ఉండగా చంద్రబాబు ప్రజల కోసం ఏ మంచి చేయక పోయినా.. ఆయన కోసం స్టార్ కాంపెయినర్లు ఏపీకి వస్తున్నారని.. ఏ మంచి చేయకుండా మోసాలు చేసినా, చంద్రబాబును భుజాన ఎత్తుకునేందుకు స్టార్ కాంపెయినర్లు ఉన్నారంటూ సీఎం వైఎస్ జగన్ ఉరవకొండ సభలో ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు ఒక స్టార్ కాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు వదిన మరో స్టార్ కాంపెయినర్ అని, పక్క పార్టీలోకి వెళ్లి మరో స్టార్ కాంపెయినర్‌గా ఉన్నారు.. రాష్ట్రాన్ని విడగొట్టిన చంద్రబాబు అభిమాన సంఘం మొత్తం చంద్రబాబు కోసం కష్ట పడుతోంది అంటూ ఉరవకొండ పర్యటనలో సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేయగా.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్..