విశాఖపట్నంలో కలకలం సృష్టించిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఇక, అరెస్ట్ అయిన 11 మంది నిందితులు ఫొటోగ్రాఫర్లే.. అరెస్ట్ తర్వాత వారిని కోర్టుముందు హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.. ఈ కేసులో మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. కీలక నిందితుడిగా ఉన్న బాలిక ప్రియుడు ఇమ్రాన్తో పాటు అతని స్నేహితుడు షోయాబ్ పరారీలో ఉన్నట్టు…
కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో ఓ వాలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. మండలంలోని పెదప్రోలు గ్రామస్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడ వాలంటీర్ సుధాకర్ రెచ్చిపోయాడు. డీజే వివాదంలో గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాడు.. మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు మండిపడుతున్నారు స్థానికులు..
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్లోనూ లిక్కర్ సేల్క్ కొత్త రికార్డు సృష్టించాయి.. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.. ఈ రెండు రోజుల్లో కలిపి ఏకంగా దాదాపు రూ.250 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది.. డిసెంబర్ 31వ రోజున రాష్ట్రవ్యాప్తంగా రూ.147 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుండగా.. జనవరి 1వ తేదీకి వచ్చేసరికి దాదాపు రూ.100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విశాఖపట్నంలో కోవిడ్ కేసులు ఉధృతి పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువైంది. తాజాగా 10 మందికి వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో.. ఈ సీజన్లో కరోనా భారినపడ్డ బాధితుల సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రులు, హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటి.. తొలి దశలో ఆరోగ్య సురక్ష విజయవంతంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. 60 లక్షల మందికి పైగా సొంత ఊళ్లలోనే వైద్యం అందించింది.. ఇక, ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.