కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికకి సంబంధించి ఏఐసీసీ పెద్దలు మా అభిప్రాయం అడిగారని తెలిపారు.. అయితే, షర్మిల పార్టీలో చేరితే కాంగ్రెస్ కి ఉపయోగం ఉంటుందని అందరం ఏకాభిప్రాయం చెప్పామని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆమె స్థానంపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు పళ్లంరాజు
మేం 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం.. దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం.. కానీ, ఆయన పార్టీని వీడారు.. అయితే, పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదు.. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం…
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ అధిష్టానం చేపట్టిన సీట్ల మార్పులు - చేర్పులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నాకు టిక్కెట్ వస్తోందో? రాదో? తెలియదు అన్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేస్తాను అని ప్రకటించారు. ఇక, అధిష్టానం నుంచి నాకు ఎలాంటి పిలుపు అందలేదన్న ఆయన.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురబ (కురుమ) సామాజిక వర్గం బలంగా ఉందని గుర్తుచేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు.. దీనికోసం బుధవారం రోజు కాకినాడ చేరుకున్నారు జనసేనాని.. ఇక, మూడు రోజుల పాటు అంటే.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అక్కడే మకాం వేయనున్నారు.
జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై వైఎస్ జగన్ సర్కార్ ఫోకస్ పెట్టారు.. జనవరి నెలలో మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలువైపు అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
పల్నాడు జిల్లా నరసారావు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తాడేపల్లికి చేరింది.. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు స్థానిక నేతలు.. ఈ సారి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించింది..