ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కేపీ సింగ్ బాఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ విస్తృతంగా పర్యటించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రరభుత్వం కొత్త పథకాలను గ్రామీణ స్థాయిలో తీసుకువెళ్తుందని వెల్లడించారు. ఇక, గ్రామీణ పథకాలకు 80 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే.. 20 శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలియజేశారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మన్ పథకం అందరికీ ఉపయోగపడుతుందన్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి.. అన్ని పీహెచ్‌సీ హెల్త్ ఎండ్ వెల్నెస్ సెంటర్స్ కి మేం 60 శాతం ఫండ్ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.
Read Also: Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సాంగ్ లాంచ్ చేసిన ఆర్జీవీ..
మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు ఎస్పీ సింగ్ బాఘేల్.. మాకంటూ ఒక పార్టీ, మాకంటూ ఒక ఐడియాజీతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు వెళ్తుందని వెల్లడించారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్. కాగా, వైఎస్సార్ జీవించినంత కాలం బీజేపీకి వ్యతిరేకమేనని, కానీ, ఇవాళ ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని షర్మిల వ్యాఖ్యానించిన విషయం విదితమే.. బీజేపీకి ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయని, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉందని సంచలన ఆరోపణలు చేశారు.. అంతేకాదు.. వైఎస్ జగన్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తానన్న జగన్ ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించలేదని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించిన విషయం విదితమే.