YSRCP Strategy: గంటా రాజీనామా ఆమోదం వెనుక వైసీపీ వ్యూహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Strategy: దాదాపు మూడేళ్ల క్రితం రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం వెనుక అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉంది అంటున్నారు విశ్లేషకులు.. వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగుల్లో భాగంగానే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర పడినట్టు చెబుతున్నారు.. టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడమే దీనికి ఉదహరణగా చెబుతున్నారు.. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా రాజీనామాను ఆమోదించిన అసెంబ్లీ స్పీకర్.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మూడేళ్ల కిందట రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు.. ఏళ్లపాటు రాజీనామా ఆమోదంపై వేచిచూస్తూ వచ్చిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
Read Also: Ganta Srinivasa Rao Resignation Accepted: గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదం తెలపడం వెనుక రాజ్యసభ ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు.. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దానికి అనుగుణంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర వేసిందనే చర్చ సాగుతోంది. మరోవైపు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు.. టీడీపీ నుంచి వైసీపీ దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేల డిస్‌క్వాలిఫికేషన్ పై కూడా చర్చ సాగుతోంది.. గంటా రాజీనామా ఆమోదంతో.. డిస్‌క్వాలిఫికేషన్ వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.. గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దానిపై విమర్శలు గుప్పించింది.. స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని ఆరోపించారు.. దీంతో.. 2021, ఫిబ్రవరి 12వ తేదీన విశాఖలోని కూర్మనపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్షకు మద్దతు ప్రకటించిన గంటా శ్రీనివాసరావు.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విన్నవించారు. అయితే, ఆ రాజీనామాపై నిర్ణయాన్ని ఇంత కాలం పెండింగ్‌లో ఉంచిన స్పీకర్.. ఇప్పుడు ఆమోదించింది.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!