వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు కేశినేని శ్వేతా.
నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం జగన్.. మా ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలుసు.. వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు..? అని ప్రశ్నించారు సీఎం జగన్
తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల సిద్ధమేనా...? అంటూ ప్రశ్నించిన ఆయన.. నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల.. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు.
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) యాజమాన్యం ఏప్రిల్ 2 నుండి కొనసాగుతున్న సమ్మె ప్రభావాన్ని చూపుతూ ఏప్రిల్ 24 (బుధవారం) తన రాజమహేంద్రవరం యూనిట్‌కు ‘లాకౌట్’ ప్రకటించింది. ఏపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ జారీ చేసిన అధికారిక లేఖ ప్రకారం, కార్మికులు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఫలితంగా మిల్లులో ఆపరేషన్ మరియు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.