CM Jagan London Tour: లండన్ పర్యటకు సీఎం జగన్.. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan London Tour: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్ట్) నుంచి బయల్దేరి వెళ్లారు. లండన్ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్టు తదితర వైసీపీ నేతలు సెండాఫ్ ఇచ్చారు. ఈ నెల 31వ తేదీ తిరిగి బెజవాడ చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
Read Also: S. Jaishankar: కిర్గిజిస్థాన్ లో విదేశీ విద్యార్థులపై దాడులు.. స్పందించిన భారత విదేశాంగ మంత్రి
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు.. లోకేష్ కి అమెరికన్ సిటీజన్ షిప్ ఉన్నట్టు కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు.. అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్ లు ముందుగానే లోకేష్ పెట్టినట్టు గుర్తించారు.. సీఎం జగన్ వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్ కనపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అయితే, పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో గుండె పోటు వచ్చిందని లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తుండగా.. ఆ వెంటనే లోకేష్‌ను ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు.. అయితే, సీఎం జగన్ విదేశీ పర్యటనకు లోకేష్‌కి సంబంధం ఏంటి? ఆ సమయంలో ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు..? లోకేష్.. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను ఎవరికి పెట్టాడు..? తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!