Sajjala Ramakrishna Reddy: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి.. కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీస్ అబ్జర్వర్ అధికారులను, పోలీసులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉంది కాబట్టి.. టీడీపీ తన ఏజెంట్లను నియమించుకుంది. అధికారులను.. వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనేది చంద్రబాబు నైజం అని దుయ్యబట్టారు. మేం స్ట్రయిట్ గా ఉంటాం. అధికారుల సాయంతో మేం అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను మారిస్తే.. అంతా దారిలోకి వస్తుందన్నారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని మేం అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అలాంటివి జరిగినా మేం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
మాది చాలా బలమైన పార్టీ.. టెక్నికల్‌గా మేం అధికారంలో ఉన్నా.. ప్రాక్టీకలుగా మేం అధికారంలో లేనట్టే అన్నారు సజ్జల.. అయితే, ఈసీ నిష్పాక్షింగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే పొలిటికల్ వయొలెన్స్ అనేదే జరగదన్నారు. ప్రజలు చాలా ఉత్సాహంతో పోలింగులో పాల్గొన్నారు. మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం మాకు శుభ సూచికంగా వెల్లడించిన ఆయన.. కుప్పంలో మేం గెలవబోతున్నాం. రాష్ట్రం అంతా వైసీపీకి చక్కటి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనకు అనుకూలంగా ఓట్లు వెల్లువెత్తాయి. బస్సుల్లో వచ్చి ఓట్లేసిన వాళ్లంతా జగన్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అన్నారు. మేం ఎవర్నీ భ్రమలో పెట్టాల్సిన అవసరం లేదు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత వల్లే అనుకుంటారు.. కానీ, ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు.
వాళ్లిచ్చిన హామీలను కూడా చంద్రబాబు ప్రచారం చేసుకోలేదని ఎద్దేవా చేశారు సజ్జల.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్‌ను విమర్శించడంతోనే ఎన్నికల్లో చంద్రబాబు లబ్ది పొందే ప్రయత్నం చేశారన్న ఆయన.. ప్రజలు వైసీపీని ఓన్ చేసుకున్నారు. మామూలుగా అయితే చంద్రబాబు ఈపాటికే బయటకు వచ్చేవారు. తమ ఓటమి ఖాయమని చంద్రబాబుకు కూడా అర్థమైందని వ్యాఖ్యానించారు. అధికారుల మీద.. పోలీసుల మీద ఫిర్యాదులు చేయొచ్చు.. కానీ, ఎవర్ని నియమించాలో కూడా కూటమి నేతలే చెప్పారు. కూటమి ఏర్పడినప్పుడే చంద్రబాబుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని మేం భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈసీ తప్పును సరిదిద్దుకోవడం మంచిదని సూచించారు. ఎక్కడైతే అధికారులను మార్చారో.. అక్కడే గొడవలు జరిగాయి. ఈ-ఆఫీసు మార్చొద్దని చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. తానేదో అధికారంలోకి వస్తున్నారనే ఇంఫ్రెషన్ క్రియేట్ చేస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు తన గురించి తానేం అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.
ఇక, తాడిపత్రి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు సజ్జల.. అవసాన దశలో కూడా చంద్రబాబు.. టీడీపీ పద్దతి మారలేదన్న ఆయన.. గతంలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి పదే పదే మాట్లాడారు.. ఇప్పుడు మాట్లాడడం లేదు. దీనిపై ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల టీడీపీకే నెగెటీవ్ అయ్యిందన్నారు. తాను చేసిన తప్పుడు ప్రచారం ఫలితం జూన్ 4వ తేదీన తెలుస్తుంది. ఏపీ చేసిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిదని నీతి ఆయోగ్ కూడా చెప్పిందని గుర్తుచేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.