మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు.. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది..
ఆంధ్రప్రదేశ్లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఇక, అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు ప్రవేశ పెట్టనున్నారు మంత్రి పొంగూరు నారాయణ..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయబోతున్నారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.. అయితే, టిడ్కో ఇళ్ల అంశంపై సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. టిడ్కో ఇళ్ల లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాశామని తెలిపారు.. హడ్కో నుంచీ రుణం ప్రభుత్వమే తీసుకుని టిడ్కో రుణాలు తీరుస్తాం అని వెల్లడించారు.
ఈ రోజు మహారాష్ట్రలోని డెగ్లూర్లో మొదట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతంగా చెప్పుకొచ్చారు.. బాలా సాహెబ్ ఠాక్రే (బాల్ ఠాక్రే) నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను.. శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
2024-25 సంవత్సరానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయంపుపై అసెంబ్లీలో నోట్ ఆన్ డిమాండ్స్ ప్రవేశపెట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు.. భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్ లకు 15,513 కోట్ల రూపాయలు కేటాయింపు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు నిమ్మల.