విజయవాడ మునకకు కారణం బుడమేరు కాదు.. నాయకుల తప్పిదం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పూడిక తీస్తే వరదల ప్రభావం అంతగా ఉండదు.. ఆక్రమణల కారణంగా ముంపునకు ప్రభుత్వాలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో పర్యటించిన ఆయన.. కొల్లేరును పరిశీలించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే కుళాయి, విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.. తాడిపత్రిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ.. ఇకపై చెత్త వేస్తే తిరిగి వారి నివాసంలో వేస్తామని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు..
తెలంగాణలో అమృత్ టెండర్స్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది విపక్షాల ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే.. తానము ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటూ విమానం ఎక్కారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. దాంతో ఢిల్లీలో ఏదో జరగబోతోందంటూ ఓ రేంజ్లో హైప్ వచ్చింది.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆరంభమైన కోటిదీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.. ఇల కైలాసంలో జరిగే కోటి దీపాల పండుగను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు.. ఇక, ఆరో రోజు కోటిదీపోత్సవం కన్నుల పండుగా సాగింది..
కీలక సూచనలు చేశారు మంత్రి నారాయణ.. ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై పలు సూచనలు చేశారు నారాయణ .. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని కీలక అంశాలను పంచుకున్నారు.. అంతేకాదు.. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడించారు.
ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్గా ఏపీ అవతరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉద్యోగాలు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త విధానాలను రూపొందించాం అన్నారు.. మొదటిగా వచ్చిన 200 పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానాలు ఉన్నాయి.. 50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.. అమరావతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో టాటా ఇన్నోవేషన్…
విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో జెర్సీ కలకలం సృష్టించింది.. హోటల్లో ఓ కస్టమర్ భోజనం ఆర్డర్ ఇవ్వగా.. ఆ భోజనంలో జెర్రీ దర్శనం ఇచ్చింది.. దీంతో.. షాక్కు గురయ్యాడు సదరు కస్టమర్.. అదే సమయంలో అదే హోటల్లో భోజనం చేస్తున్నారు కేంద్ర మానవ హక్కుల కమిషన్ (NHRC) ఇంఛార్జ్ చైర్మన్ విజయభారతి సయానీ.. దీంతో.. కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ నిర్వాహకుల తీరుపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సీరియస్ అయ్యింది.
విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది.. పెదగంట్యాడ లో యువతిపై జమ్మూ కాశ్మీర్కు చెందిన నీరజ్ శర్మ రాడ్తో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు యత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు.. అయితే, బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.. ఉన్మాది దాడిలో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. ఇక, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు... తలపై సుమారు 30 కుట్లు పడ్డాయి.. ప్రేమోన్మాది దాడి కేసులో బాధితురాలు తండ్రి కీలక విషయాలు…
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు అయ్యాయి.. ఇప్పటికే జారీ చేసిన విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది..