అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ (దెయ్యపు చేప) గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు రామ్మూర్తి నాయుడు.. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలో కాంక్లేవ్ ముగియగానే.. హైదరాబాద్ బయల్దేరనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట రామ్మూర్తి నాయుడు.. అయితే, తన చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం అందుకున్న మంత్రి నారా లోకేష్.. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని.. అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు..
కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు ఈ మేరకు నోటీసులు అంటించారు పోలీసులు..
ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఈ రోజు జరనున్న విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. శ్రీ సుబ్రహ్మణ్యమఠం మాఠాధిపి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు.. ప్రవచనామృతం.. వేదికపై కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన.. భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన.. కోటి దీపోత్సవ దేదికపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడికి మూషిక వాహన సేవ నిర్వహించనున్నారు..
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో బహిరంగసభలు, రోడ్షోలలో పాల్గొననున్నారు పవన్.. మొత్తంగా మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఏపీ డిప్యుటీ సీఎం.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో శుక్రవారం భేటీ అయ్యారు..