Pilli Subhash Chandra Bose: పొరపాటున కూడా నేను పార్టీ మారను.. వైసీపీలోనే ఉంటాను అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంతో ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు.. విజయసాయి రెడ్డి రాజీనామా దురదృష్టకరం అన్నారు.. విజయసాయి రెడ్డి పార్టీకి, పార్లమెంట్ లోనూ వెన్నెముక లాంటివారని అభివర్ణించారు.. ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది తెలియదు.. కానీ, మా పార్టీ సభ్యుడిని ఇప్పుడు మళ్లీ రాజ్యసభకు ఎంపిక చేసుకోలేని పరిస్థితి లేదన్నారు.. విజయ సాయిరెడ్డి అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. రేయింబవళ్లు పని చేశారు.. ఆయన లేని లోటు తీవ్రమైనది అన్నారు.. అయితే, అధికారం పోయాక పార్టీ నుంచి వెళ్లటం, రావడం కామన్.. కానీ, ఆ జాబితాలో విజయసాయిరెడ్డిని చూడలేం అన్నారు.. ఏదేమైనా పొరపాటున కూడా నేను పార్టీ మారను.. వైసీపీలోనే ఉంటాను అని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్..
Read Also: Saif Ali Khan Attack: సైఫ్ ఎటాక్ నాటి బట్టలు సేకరించిన పోలీసులు.. ఎందుకంటే?
ఇక, భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌ను కలిసిన రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన..నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదు.. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు అని వ్యాఖ్యానించారు.. అసలు కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు.. నేను దేవుడిని నమ్మాను.. నమ్మక ద్రోహం చేయను.. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా వైఎస్ జగన్‌కు ప్రజాధరణ తగ్గదు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే..