విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.. బాధితురాలని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు.
ఇవాళ కౌల్సిల్ వేదికగా రుషికొండ అంశంపై మరోసారి రచ్చ జరిగింది.. దీనిపై శాసన మండలిలో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్.. ఎండాడ భూములు, రుషికొండ అంశంలో స్ధానికుల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందని విమర్శించారు.. రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండ బీచ్ అన్నారు.. అయితే, అన్ని అద్భుతంగా ఉండగానే రిసార్ట్స్ పడగొట్టేశారని మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ అసెంబ్లీలో అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ నుంచి 1,942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీలకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు..
ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసు విచారణకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరవుతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. తాను కేసు విచారణకు రాలేంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు రాంగోపాల్ వర్మ.. ఈ మేరకు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారట ఆర్జీవీ.. తాను సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో.. నాలుగు రోజులు గడువు కోరారు వర్మ.. కేసు దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని రాంగోపాల్ వర్మ పోలీసులకు సమాచారం అందించారు.
సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. మనకు తెలిసి వ్యక్తి.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా? అది అసలు ఖాతానేనా..? ఇంకా ఎవరైనా ఆ పేరుతో ఖాతా ఓపెన్ చేశారా? అనేది కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. చెల్లి పేరుతో ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ఓ అక్క.. ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అంతేకాదు.. అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది.. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆత్మహత్యాయత్నం చేసింది..
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై గతంలో నమోదయిన క్రిమినల్ కేసు తొలగించింది కోర్టు.. పవన్ కల్యాణ్‌పై అభియోగాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్.శరత్ బాబు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి.. ఈ రోజు శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది.. నేడు కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నారు..
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.. ఓ వైపు పోలీసుల పెట్టిన డెడ్‌లైన్ ముంచుకొస్తుంది.. మరోవైపు.. హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఇవాళ ప్రకాశం జిల్లా మద్ధిపాడు పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విచారణకు హాజరుకావాల్సి ఉంది..
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. తెల్లవారుజామున బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితులు వస్తున్నాయి.. ఇక, ఏజెన్సీల్లో అయి మరీ దారుణంగా పరిస్థితులు ఉన్నాయి.. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి పడిపోయాయి ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ నమోదు అయ్యింది.. ఈ రోజు ముంచింగిపుట్టులో 9 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు..