రాజ్యసభ చైర్మన్‌కు సాయిరెడ్డి రాజీనామా లేఖ..
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌తో సమావేశమైన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు.. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇంతవరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించలేదు.. విజయసాయిరెడ్డి వ్యవహారం కావటంతో స్పందించేందుకు తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది.. పార్టీ అధినేత వైఎస్ జగన్ లండన్ లో ఉండటంతో నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయట పార్టీ వర్గాలు.. విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.. విజయసాయి రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మారీ రాజీనామా చేయొద్దని కోరారు ఎంపీ గురుమూర్తి.. కానీ, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శుక్రవారం ప్రకటించిన సాయిరెడ్డి.. ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనా చేశారు..
విజయసాయిరెడ్డిని కలిసిన ఎంపీ గురుమూర్తి.. ఆసక్తికర వ్యాఖ్యలు..
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్lను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.. అయితే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం రోజే ప్రకటించారు.. దానికి తగినట్టుగానే ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇక, విజయసాయిరెడ్డి.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్l దగ్గరకు వెళ్లకముందే.. ఎంపీ గురుమూర్తి.. సాయిరెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.. రాజీనామా చేయొద్దని సాయి రెడ్డిని కోరాను అని.. కానీ, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు విజయసాయిరెడ్డి చెప్పడంలేదన్నారు.. మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సమస్యలు లేవు అని స్పష్టం చేశారు ఎంపీ గురుమూర్తి.. విజయసాయి రెడ్డితో ఆంతరంగికంగా మాట్లాడాను.. తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరానని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు ఎంపీ గురుమూర్తి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని విజయసాయిరెడ్డిని విజ్ఞప్తి చేశాను. 2029 ఎన్నికల్లో కలిసి సమిష్టిగా పోటీచేసేందుకు సమయత్తమవుదామని చెప్పాను అన్నారు.. చిన్న చిన్న లోపాలు, సమస్యలుంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని కూడా చెప్పాను.. కానీ, విజయసాయిరెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ గురుమూర్తి..
జగన్‌ను అన్నీ చెప్పాకే రాజీనామా..! విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు… ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదు.. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు అని వ్యాఖ్యానించారు.. అసలు కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు.. నేను దేవుడిని నమ్మాను.. నమ్మక ద్రోహం చేయను.. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా వైఎస్ జగన్‌కు ప్రజాధరణ తగ్గదు అని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.. నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం.. రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరుగా ఉన్నాయన్నారు.. కేసుల మాఫీ కోసమే నేను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం.. నాకు ఉంది.. బీజేపీలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగవు అని స్పష్టం చేశారు.. నా రాజీనామాతో కూటమి లాభం.. నేను రాజీనామా చేయడం 11 సీట్లు గెలిచిన వైసీపీ మళ్లీ రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి.. రాజ్యసభ సీటు.. కూటమికి వెళ్తుందని తెలిపారు విజయసాయిరెడ్డి.
డీఎస్పీల ప్రమోషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ప్రమోషన్లపై ఇచ్చిన ఆదేశాలు రీ రివ్యూ చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.. 1995 బ్యాచ్ సీఐలకు ప్రమోషన్ ఇవ్వకుండా 1996 బ్యాచ్‌కి ప్రమోషన్లు ఇచ్చింది గత ప్రభుత్వం.. అయితే, గత ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు 1995 బ్యాచ్ అధికారులు.. నిబంధనలు, సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ప్రమోషన్‌లు ఇచ్చారంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు కొందరు 1995 బ్యాచ్‌కు చెందిన అధికారులు.. దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ప్రమోషన్లను రీ రివ్యూ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది..
కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు వీరే..
కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. “అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం. కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన మరో సర్జన్ డాక్టర్ సోహెబ్ కూడా పరారీలో ఉన్నాడు. ఆర్గనైజర్లు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌ల జాడ కోసం వెతుకుతున్నాం. మీడి యేటర్లు సూరజ్ మిశ్రా, శంకర్లు కూడా తప్పించుకు తిరుగుతున్నారు.” అని సుధీర్ బాబు పేర్కొన్నారు. “చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అవినాష్.. ఇండియాకి తిరిగి వచ్చి పూణేలో డిప్లమా ఇన్ సర్జరీ పూర్తి చేశాడు. 2022లో హైదరాబాదులోని మాదన్నపేట లో ఉన్న జనని హాస్పిటల్ ను డాక్టర్ అవినాష్ అతని స్నేహితులు లీజుకు తీసుకున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు అవినాష్. ఈ క్రమంలో అతనికి వైజాగ్ కు చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. ఇల్లీగల్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేయాలంటూ లక్ష్మణ్, డాక్టర్ అవినాష్‌కు సూచించాడు. ప్రతి కిడ్నీ మార్పిడి సర్జరీకి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. డోనర్లు, మెడికల్ అసిస్టెంట్లు, రిసెప్షనిస్టులను మొత్తం కూడా తానే చూసుకుంటానని అవినాష్ కు లక్ష్మణ్ చెప్పాడు. డాక్టర్ అవినాష్ ఆపరేషన్ థియేటర్ ఇవ్వడంతో పాటు ఆపరేషన్ తర్వాత పేషెంట్లను చూసుకోవాల్సి ఉంటుంది అని ఒప్పందం కుదిరింది. అలా ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి చేస్తూ వచ్చారు. ఈ ఆపరేషన్ అన్నిటిని కూడా వైజాగ్ కి చెందిన పవన్, పూర్ణ, అభిషేకాలు చూసుకునేవారు.” అని సీపి సుధీర్ బాబు వెల్లడించారు.
అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం..
కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌ను సంస్థ విచారించింది. అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. నిర్మాణానికి ముందు కనీస నిబంధనలు పాటించలేదని కమిషన్ పేర్కొంది. నిర్మాణ సంస్థలు, నిర్మాణంలో నిబంధనలు పాటించి ఉంటే ఇంత డ్యానేజ్ జరిగి ఉండేది కాదని తెలిపింది. ఏజెన్సీల ఫోకస్ నిధుల మీదనే ఉందని స్పష్టం చేసింది. కమిషన్ ముందు కూడా నిధుల ప్రస్తావానే తెస్తున్నాయంది. అన్నారం బ్యారేజి నిర్మించిన ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపించింది. టెండర్లు వేసే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా? అని కమిషన్ ప్రశ్నించింది. ఈపీసీ కాంట్రాక్టు అయితే సర్వేలు చేస్తారు. ఐటమ్ రేట్ కాంట్రాక్టు కాబట్టి నేరుగా ఎలాంటి సర్వేలు చేయలేదని సంస్థ సమాధానమిచ్చింది. ప్రాజెక్టు నాణ్యత ఎన్ని రోజులు ఉంటుందని కమిషన్ ప్రశ్నించింది. వందేళ్ల వరకు ఉండేలా నిర్మించినట్లు సంస్థ పేర్కొంది. నిబంధనలు పాటించి ఉంటే వందేళ్ల ప్రాజెక్టు ఏడాది కే డ్యామేజ్ అయ్యేది కాదని కమిషన్ మండిపడింది. అన్నారం బ్యారేజి నిర్మాణం ఆలస్యం కావడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించింది. లొకేషన్ మార్పు కారణంగా బ్యారేజి నిర్మాణం ఆలస్యం అయ్యిందని సంస్థ స్పష్టం చేసింది. 2017, 2018 వరదల్లో ఎలాంటి ఇబ్బంది జరగలేదని.. 2019 నవంబర్ వరదల్లో సమస్యలు గుర్తించామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
942 మంది సైనికులకు గ్యాలంట్రీ అవార్డులు..
2025 రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు చెందిన మొత్తం 942 మంది సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డు లభించనున్నాయి. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పతకాలు, 101 మందికి విశిష్ట సేవలందించినందుకు రాష్ట్రపతి పతకం, 746 మందికి ప్రతిభ కనబర్చిన పతకాలు లభించాయి. 95 గ్యాలంట్రీ అవార్డులలో ఎక్కువ భాగం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన సైనికులకు ఇవ్వబడ్డాయి. ఇందులో నక్సలైట్ల ప్రాంతానికి చెందిన 28 మంది, జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 28 మంది, ఈశాన్య ప్రాంతానికి చెందిన ముగ్గురు సైనికులు, ఇతర ప్రాంతాలకు చెందిన 36 మంది సైనికులను సన్మానించారు. 78 మంది పోలీసులు, 17 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. 101 రాష్ట్రపతి పతకాలలో విశిష్ట సేవ (PSM), 85 పోలీసు సేవకు, 05 అగ్నిమాపక సేవకు, 07 సివిల్ డిఫెన్స్-హోమ్ గార్డ్‌కు, 04 సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్ సర్వీస్ (MSM) పతకాలలో 634 పోలీసు సర్వీస్‌కు, 37 ఫైర్ సర్వీస్‌కు, 39 సివిల్ డిఫెన్స్-హోమ్ గార్డ్స్‌కు, 36 కరెక్షనల్ సర్వీస్‌కు లభించాయి. రాష్ట్రాల వారీగా గ్యాలంట్రీ అవార్డు గణాంకాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మంది, ఒడిశాకు చెందిన 6, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 15 మంది పోలీసు సిబ్బందికి ఈ అవార్డు లభించింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక సైనికుడు, బీఎస్‌ఎఫ్‌కు చెందిన 5, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 19, ఎస్‌ఎస్‌బీకి చెందిన నలుగురికి గ్యాలంటరీ అవార్డు లభించింది. ఇది కాకుండా ఉత్తరప్రదేశ్ అగ్నిమాపక విభాగానికి చెందిన 16 మంది సిబ్బందికి, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఒక అగ్నిమాపక విభాగానికి ఈ అవార్డు లభించింది.
ఆర్మీ క్యాంపును లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
2025 జనవరి 25న, జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఉగ్రవాద ఘటన చోటుచేసుకుంది. బిల్వార్ ప్రాంతంలోని భటోడి, మువార్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై అర్థరాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, సైన్యం ఎదుకాల్పులు చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) సతీష్ ఎస్. జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం (జనవరి 24, 2025) ఆయన ఫీల్డ్ కమాండర్లతో భద్రతా ముసాయిదా అంశాలపై చర్చించి, సైనికులతో సమావేశమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా, పుల్వామా జిల్లాలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల స్థావరాన్ని ఛేదించి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలు గణతంత్ర దినోత్సవ వేడుకల ముందు భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలను చూపిస్తున్నాయి.
వయసనేది జస్ట్ నెంబర్.. 38 ఏళ్ల వయసులో రికార్డ్ సృష్టించిన స్పిన్నర్ (వీడియో)
ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. జనవరి 25 శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 38 ఏళ్ల నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌పై ప్రతాపం చూపించాడు. మ్యాచ్‌లో తొలిరోజే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి పాక్ స్పిన్నర్ గా రికార్డ్ సృష్టించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నోమన్ దెబ్బకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ వద్ద సమాధానం లేకపోయింది. మొత్తానికి వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గత కొద్దీ రోజులుగా కెప్టెన్ షాన్ మసూద్‌కు నోమన్ అలీ ట్రంప్ కార్డ్‌గా నిలిచాడు. దాంతో, ముల్తాన్ టెస్టు తొలి రోజు 8వ ఓవర్‌లో షాన్ అతనికి బంతిని అందించాడు. దీని తర్వాత, నోమన్ తన స్పిన్ బౌలింగ్‌లోని మ్యాజిక్‌ను చూపించాడు. దాంతో తాను వేసిన రెండవ ఓవర్‌లోనే వికెట్ తీశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చి ఒకదాని తర్వాత ఒకటిగా 3 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అతను ఓవర్ మొదటి మూడు బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, టెవిన్ ఇమ్లాచ్, కెవిన్ సింక్లైర్‌లను అవుట్ చేయడం ద్వారా తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి పాక్ స్పిన్నర్ గా నోమన్ రికార్డ్ సృష్టించాడు.
సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!
సైఫ్ అలీఖాన్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల వాంగ్మూలాలపై చర్చ మొదలైంది.ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే అంతకు ముందు రోజే నమోదు చేసిన ఆయన భార్య వాంగ్మూలానికి తేడా ఉంది. సైఫ్ అలీఖాన్ వాంగ్మూలంలో తాను 11వ అంతస్తులో ఉన్నానని చెప్పాడు. జనవరి 15-16 రాత్రి, నానీ ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని, అది విని సైఫ్ అలీఖాన్, తన భార్య కరీనా కపూర్ ఖాన్ జహంగీర్ గదికి వెళ్ళమని చెప్పాడు. అయితే కరీనా వాంగ్మూలం ప్రకారం మాత్రం సైఫ్ మాత్రమే జహంగీర్ గదికి వెళ్లాడని చెప్పింది. భిన్నమైన వాంగ్మూలాలు నమోదు కావడంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది. సైఫ్ అలీఖాన్ కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజాద్ జనవరి 29 వరకు పోలీసు కస్టడీని పొడిగించారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితుల ఫోరెన్సిక్ విచారణ కూడా నిర్వహించనున్నారు. ముంబయి కోర్టు నిందితులను గుర్తించేందుకు పోలీసులను ఫోరెన్సిక్ పరీక్షను కోరింది, దానిని కోర్టు కూడా అంగీకరించింది. మరో పక్క తన కొడుకును ఇరికించారని నిందితుడి తండ్రి తెలిపారు. సహాయం కోసం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు భారత హైకమిషన్‌ను సంప్రదిస్తానని అన్నారు.. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న వ్యక్తి తన కొడుకు కాదని అంటున్నాడు. కొన్ని సారూప్యతలతోనే తన కుమారుడిని అరెస్టు చేసి కేసులో ఇరికించారని తండ్రి ఆరోపించారు.
న్యూ జనరేషక్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. !
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్‌గా పిలుపందుకున్న వాళ్లలో ముందుండే పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశ దిశను మార్చేలా ఆయన తీసిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి, వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్స్ లవ్ స్టోరీస్. అందుకే యూత్‌లో మణి సినిమాలకు అంత క్రేజ్. కానీ ఆ మధ్య కొంత కాలంలో ఆయన ఫామ్ తగ్గిపోయింది ఎక్కువ ఫ్లాపులు చవి చూశారు. తిరిగి దుల్కర్ సల్మాన్ తో ‘ఓకే బంగారం’ మూవీతో ఫామ్ లోకి వచ్చినట్టే వచ్చి.. కడలి, చెలియా, నవాబ్, లాంటి సినిమాలతో మళ్ళీ వెనక్కి పడిపోయాడు మణి. దీంతో ఈ సారి బారి ప్లాన్ తో ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ తీసి తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రజంట్ కమల్ హాసన్, శింబుతో ‘తగ్ లైఫ్’ మూవీ పూర్తి చేసిన మణిరత్నం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. సమర్‌లో విడుదలకు ప్లాన్ చేయడంతో దానికి అనుగుణంగా అని పనులు ఫినిష్ చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ పూర్తి అయిన తర్వాత మణిరత్నం తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనే డౌట్ అందరిలో మొదలైంది. ‘దళపతి’ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు అని, రజనీకాంత్ కు ఒక కథ కూడా చెప్పారని టాక్ గట్టిగా వినపడుతుంది కాని..