CM Chandrababu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను సమర్పించారు.. అంతేకాదు.. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని కూడా వెల్లడించారు.. అయితే, విజయసాయిరెడ్డి వ్యవహారంపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దావోస్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. సాయిరెడ్డి అంశంపై స్పందిస్తూ.. నమ్మకం ఉంటే ఉంటారు.. లేకపోతే వెళ్ళిపోతారని వ్యాఖ్యానించారు.. అయితే, పార్టీ పరిస్థితి కూడా ముఖ్యం అన్నారు.. కానీ, ఇది వాళ్ల (వైసీపీ) ఇంటర్నల్ వ్యవహారం అన్నారు.. వ్యక్తిగత కోపంతో వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు.. రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో టీమిండియా ఆటగాళ్లు.. వైరల్ అవుతున్న ఏఐ ఫొటోస్
కాగా, రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు… ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదు.. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు అని వ్యాఖ్యానించారు.. అసలు కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు.. నేను దేవుడిని నమ్మాను.. నమ్మక ద్రోహం చేయను.. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా వైఎస్ జగన్‌కు ప్రజాధరణ తగ్గదు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే..