* హైదరాబాద్: గాంధీభవన్‌కి చేరుకున్న పటాన్‌చెరు పంచాయితీ.. ఇవాళ గాంధీ భవన్‌కి రావాలంటూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్, కాట శ్రీనివాస్‌గౌడ్‌కి పిలుపు
* హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. 128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం
* హైదరాబాద్ నగర శివారులోని ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో స్పెషలాఫీసర్లు కేటాయింపు..
* ఏపీ: నేడు జనసేనలోకి భారీగా చేరికలు.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నాగబాబు సమక్షంలో పలువురు క్షేత్రస్థాయి నేతలు చేరుతున్నట్టు సమాచారం
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* అమరావతి: మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రకు ఇవాళ్టితో రెండేళ్లు పూర్తి.. 226 రోజులు యువగళం పేరుతో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్.
* గుంటూరు: నేడు తెనాలి ఐతానగర్ , ఒకటి రెండు వార్డుల్లో పాదయాత్ర నిర్వహించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్..
* రాష్ట్ర మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నేడు గుంటూరు జింకానా ఆడిటోరియంలో , గ్లోబల్ అడ్వాన్స్ ఇన్ ఎమర్జెన్సీ ,మెడికల్ కేర్ వర్క్ షాప్ నిర్వహించనున్న గుంటూరు మెడికల్ కాలేజ్.. కార్డియాక్ అరెస్ట్ లు ప్రథమ చికిత్సలపై అవగాహన నిర్వహించనున్న ప్రత్యేక డాక్టర్ల బృందం…
* నేడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ,బిసి ప్రజా ప్రతినిధులకు, అభినందన సభ…
* పల్నాడు: నేడు వినుకొండ మండల పరిషత్ కార్యాలయంలో, ప్రజా దర్బార్…
* ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి..
* బాపట్ల : అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సైకిళ్ళు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.. అనంతరం జలవనరుల శాఖ అధికారులు మరియు నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి గొట్టిపాటి..
* ప్రకాశం : డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రిమాండ్ లో ఉన్న కామేపల్లి తులసిబాబును మూడు రోజుల కస్టడీ నిమిత్తం నేడు ఒంగోలుకు తీసుకురానున్న పోలీసులు..
* గుంటూరు: నేడు విజ్ఞాన మందిరంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందన సభ.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న కేంద్రమంత్రులు రాంమోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పల్లా శ్రీనివాస్ (ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు).. గౌరవ అతిథులుగా హాజరుకానున్న మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, శ్రీమతి సవిత, కొలుసు పార్థసారధి, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, తదితరులు
* అనంతపురం : నేటి నుంచి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల హాకీ పోటీలు.
* విశాఖ: నేడు ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు… రీజినల్ టూరిజం ఇన్వెస్టర్స్ ఎంగేజ్మెంట్ పేరుతో నిర్వహిస్తున్న పర్యాటక శాఖ.. అడ్వెంచర్, క్రూయిజ్ టూరిజం, ఎకో టూరిజం, అరకు కాఫీ, 2024-29 న్యూ టూరిజం పాలసీపై చర్చ.. సదస్సు ప్రారంభించనున్న మంత్రి దుర్గేష్
* విశాఖ పర్యటనలో మంత్రి నారా లోకేష్… గత వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర కు రెండేళ్ళు పూర్తి. విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ తో కేక్ కట్ చేయించేందుకు ఏర్పాట్లు చేసిన నాయకత్వం.. పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లనున్న లోకేష్.
* భారత ఉపఖండం నుంచి నిష్క్రమించనున్న ఈశాన్య రుతుపవనాలు.. రాష్ట్రంలో పొగమంచు, పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు… అల్లూరి జిల్లాలో పలు చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్ లు… ఈ సీజన్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.. రాయలసీమలో స్వలంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
* డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో నేటి నుంచే ఉమ్మడి పౌరస్మృతి అమలు.. సీఎం ధామీ ప్రకటన, తొలి రాష్ట్రంగా రికార్డు
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,742 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,466 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు