CM Chandrababu: సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు.. గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం అన్నారు.. దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు. ఏఐ.. డీప్ టెక్‌కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది అన్నారు చంద్రబాబు.. మిలింద గేట్ ఫౌండేషన్ తో హెల్త్ కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని బిల్ గేట్స్ చెప్పారన్నారు చంద్రబాబు.. దేశానికి మోడల్ గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు.. ఇవాళ వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు.. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో భవిష్యత్ లో తెలుగు వారుంటారు.. గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ను త్వరలో సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం.. దీనికి సంబంధించి మేనేజ్ మెంట్ కంపెనీ ఉంటుందన్నారు.. అందరు పారిశ్రామిక వేత్తలు జీఎల్‌సీలో ఉంటారు… సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారు చేయడమే లక్ష్యం.. కార్పోరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో సవాళ్లు ఎదుర్కొనే విధంగా తయారు చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Bhatti Vikramarka: రేపు పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తాం..
థింక్ గ్లోబల్.. యాక్ట్ గ్లోబల్‌గా చెంబుతున్నాం.. విజయవాడలో కూర్చుని ప్రపంచం అంతా పని చేస్కోవచ్చు అన్నారు చంద్రబాబు.. ఒకప్పుడు దావోస్ వెళ్తే అప్పట్లో సీఎం ఎస్ఎం కృష్ణ వచ్చేవారు. ఒకప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నారని బిల్ గేట్స్ చెప్పారని తెలిపారు. నాలుగోసారి సీఎం అయ్యాక కొత్త బ్రాండ్ ప్రమోట్ చేయాల్సి వస్తోంది.. దావోస్ లో మొత్తం 27 సమావేశాలు.. 4 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.. కంట్రీ స్ట్రేటిజిక్ డైలాగ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నాం… ఇప్పుడు ఏఐ డీప్ టెక్నలజీ వచ్చాయి. రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఇండియాలో గ్రీన్ ఎనర్జీపై చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ.. గ్రీన్ హైడ్రోజన్ బాగా ఉంటాయి. నాతో పాటు మంత్రులు లోకేష్, భరత్ 27 సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.. హైదరాబాద్ లో నా మొదటి ప్రయత్నం హైటెక్ సిటీ.. ఐటి అంటే ఇప్పుడు సైబరాబాద్ ఒక నగరం అయ్యింది.. 1995 ఐటీ.. 2025 ఏఐ.. ఇదే జర్నీ చేస్తున్నాం.. ప్రపంచం అంతా తిరిగి ఐటి పరిశ్రమలు తీసుకు వచ్చాం.. హై స్కూల్ లేని జిల్లాలో 200 ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇవాళ వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారని తెలిపారు ఏపీ సీఎం..