వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
అంగన్వాడీల ప్రతి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. ఆందోళనకు వెళ్లొ్దని సూచించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. నవంబర్ 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు మా దృష్టికి వచ్చాయి.. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది.. దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం..
శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వాకౌట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. శాసన మండలిలో వైసీపీ ఇచ్చిన ఇసుక కొరత, భవన కార్మికుల కష్టాలపై వాయిదా తీర్మానం, అగ్రిగోల్డ్ బాధితులపై పీడీఎఫ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్.
గత ప్రభుత్వ వైఫల్యాలే ఆంధ్రప్రదేశ్లో నేరాలు పెరగడానికి కారణం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి వంగలపూడి అనిత.. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తుచేసుకున్నారు..
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో చుక్కెదురైంది.. రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చే శారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది..
గుంటూరు జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది.. స్కూల్ లో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో ఓ బాలుడి హత్యకు దారి తీసింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో తోటి విద్యార్థిని కొట్టి చంపి బావిలో పడేశారు సహచర విద్యార్థులు.. ఈ ఘటనతో తీవ్ర విషయంలోకి వెళ్లిపోయింది సదరు విద్యార్థి కుటుంబం.. గత నెల 24వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన గురించి విషయం తెలిసినా, పోలీసులు పట్టించుకోలేదని…
యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పై తాజాగా పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు..
ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు 1,275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానంగా మాట్లాడిన ఆయన.. ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. EHS ద్వారా సదుపాయాలు అన్నీ అందడం లేదని, రిఫరల్ సరిగా జరగడం లేదని మా దృష్టికి వచ్చిందని వివరించారు.. అయితే, ఉద్యోగుల మెడికల్ ఫెసిలిటీల విషయంలో చర్యలు తీసుకుంటాం అన్నారు..