Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు… ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదు.. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు అని వ్యాఖ్యానించారు.. అసలు కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు..
Read Also: Hyderabad: బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. నిందితుడు షార్ట్ ఫిలిం దర్శకుడిగా గుర్తింపు
నేను దేవుడిని నమ్మాను.. నమ్మక ద్రోహం చేయను.. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా వైఎస్ జగన్‌కు ప్రజాధరణ తగ్గదు అని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.. నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం.. రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరుగా ఉన్నాయన్నారు.. కేసుల మాఫీ కోసమే నేను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం.. నాకు ఉంది.. బీజేపీలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగవు అని స్పష్టం చేశారు.. నా రాజీనామాతో కూటమి లాభం.. నేను రాజీనామా చేయడం 11 సీట్లు గెలిచిన వైసీపీ మళ్లీ రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి.. రాజ్యసభ సీటు.. కూటమికి వెళ్తుందని తెలిపారు విజయసాయిరెడ్డి.
Read Also: Vijayasai Reddy Resigns: రాజ్యసభ చైర్మన్‌కు సాయిరెడ్డి రాజీనామా లేఖ..
నా రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు.. లండన్ లో ఉన్న జగన్ తో మాట్లాడి అన్ని విషయాలు వివరంగా మాట్లాడాను అన్నారు సాయిరెడ్డి.. నేను ఏరోజు అబద్ధాలు చెప్పను, చెప్పలేదు. హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తిని. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడినైన నేను చెప్పే మాటలను అనుమానించడం, వారి వారి విజ్ఞతకే విడిచిపెడతాను అన్నారు.. కాకినాడ పోర్ట్ విషయంలో నా పై కేసు నమోదు చేశారు. ఈడీ విచారణలో నేను శ్రీ వేంకటేశ్వర స్వామి పై ప్రమాణం చేసి నాకు ఏలాంటి సంబంధం లేదని చెప్పాను అని వివరించారు.. కేవీ రావు ఎదురైనప్పుడు హలో అనే పలకరింపులు తప్పితే ఏ మాత్రం కలిసి మాట్లాడుకున్నదే లేదు. భగవంతుడి పై ప్రమాణం చేసి చెప్తున్నాను. అరబిందో వ్యాపార లావాదేవీల గురించి నేను ఏనాడు వారితో మాట్లాడలేదన్నారు.. కుటుంబ సంబంధాలు బాగా బలంగా ఉండాలంటే, బంధువుల వ్యాపార లావాదేవీల్లో జోక్యం చేసుకోకూడదని బలంగా నమ్మే వ్యక్తిని నేనన్న సాయిరెడ్డి.. నేను ఎటువంటి పదవులను ఆశించికానీ, ప్రలోభాలకు లోనై ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎవరికీ భయపడే మనస్తత్వం కాదు విజయసాయి రెడ్డిది. నేను ధైర్యంగా దేనినైనా ఎదుర్కునే శక్తి నాకు ఉందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు..