Vijayasai Reddy Resigns: రాజ్యసభ చైర్మన్‌కు సాయిరెడ్డి రాజీనామా లేఖ..
- రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా..
- రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌తో సాయిరెడ్డి సమావేశం..
- తన రాజీనామా లేఖను అందజేసిన విజయసాయిరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Resigns: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి.. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌తో సమావేశమైన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు.. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇంతవరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించలేదు.. విజయసాయిరెడ్డి వ్యవహారం కావటంతో స్పందించేందుకు తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది.. పార్టీ అధినేత వైఎస్ జగన్ లండన్ లో ఉండటంతో నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయట పార్టీ వర్గాలు.. విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.. విజయసాయి రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మారీ రాజీనామా చేయొద్దని కోరారు ఎంపీ గురుమూర్తి.. కానీ, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శుక్రవారం ప్రకటించిన సాయిరెడ్డి.. ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనా చేశారు..
Read Also: Vijayasai Reddy: కాసేపట్లో ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని నిన్నే విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం విదితమే.. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని స్పష్టం చేశారు.. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్ రాసుకొచ్చారు. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.. మరోవైపు.. టీడీపీతో రాజకీయంగా విభేదించా.. చంద్రబాబుతో గానీ, ఆయన కుటుంబంతో గానీ వ్యక్తి గతంగా విభేదాలు లేవని.. పవన్ కల్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని పేర్కొన్నారు.. ఇక, నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అంటూ సుదీర్ఘమైన పోస్టును విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!