ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు స్కీమ్‌ల పేర్లను మారుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కీమ్‌లకు పెట్టిన పేర్లను తొలగించి.. కొత్త పేర్లు పెడుతోంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. అయితే.. ఈ కాలనీల పేర్లను మారుస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల పేరను PMAY-NTR నగర్‌గా మార్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.. ఇక, సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహిస్తారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.
సెంటిమెంటుని, పండుగల్ని దోచుకునే దందాలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట! ఫెస్టివల్‌కి ఇంటికి వెళ్తున్నామన్న సంతోషమే ఉంచరు! పైసో, పరకో పట్టుకెళ్దామన్న ఆశను నిలువునా కూల్చేస్తారు. అడ్డగోలుగా దోచుకుంటారు. అసలు పండుగ వచ్చేది జనాలకు కాదు.. ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌కు! టికెట్ రేటు విషయంలో వాళ్ల నోటికి మొక్కాలి! పెంచే రేట్లకు పద్ధతీ పాడూ లేదు.
ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ ఆర్కే రోజా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్లో హవా నడిపిన మాజీ మంత్రి... ఓటమి తర్వాత చాలా రోజులు పొలిటికల్ అజ్ఞాతంలో గడిపారు. అప్పట్లో అందరికంటే ఎక్కువగా పవర్‌ని, పదవిని ఎంజాయ్ చేశారన్న పేరు వచ్చింది ఆమెకు. అలాగే నాటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు ఆమె స్థాయిని దిగజార్చాయన్న అభిప్రాయం ఉంది.
దానం నాగేందర్... గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయనది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం అలవాటని చెప్పుకుంటారు. పార్టీలు, లాయల్టీలు జాన్తానై.. పని జరగడమే మనకు ముఖ్యం అన్నట్టుగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఎథిక్స్, యాలక్కాయలు తర్వాత సంగతి.... ముందు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాల్రా భై... అంటారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆయన మీదున్న అభిప్రాయం అట. అందుకు తగ్గట్టే... తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వేసుకున్న కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి... గులాబీని పట్టేశారాయన.