Andhra Pradesh: మరో మాజీ మంత్రిపై కేసు నమోదు..
- మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు..
- నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో అక్రమ మైనింగ్..!
- రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు నేతలు, మాజీ మంత్రులపై కేసులు నమోదు అయ్యాయి.. తాజాగా, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. పోలీసులు కేసు పెట్టారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ గనికి సంబంధించి లీజు కాలం ముగియడంతో.. వైసీపీ నేతలు దానిని ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని.. అంతేకాక రాళ్ళను పేల్చేందుకు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశారని.. ఈ విషయంపై అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైన్ వద్దే నిరసన దీక్ష చేపట్టారు. పేలుడుకు ఉపయోగించే జిలేటెన్ స్టిక్స్ తో పాటు ఇతర రసాయనాలను అధికారులకు అప్పగించారు.
Read Also: UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్పట్లో ఆదేశించింది. అప్పటి నుంచి గనిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అక్రమ మైనింగ్ పై మరోసారి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణ జరిపి పదిమందిపై కేసులు నమోదు చేసింది. వీరిలో ఏ1గా.. వైసీపీ నేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి.. ఏ2గా వాకాటి శివారెడ్డి. ఏ3 గా వాకాటి శ్రీనివాసులురెడ్డి. ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!