CM Chandrababu: ఏపీ సచివాలయంలో ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.. అయితే, కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణా అధికారులు అన్నారు సీఎం చంద్రబాబు. ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు.. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్ని విషయాలు ప్రస్తావించారు… విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు.. సోలార్ పవర్‌లో భాగంగా 20 లక్షల మందికి సోలార్ పవర్ ఇవ్వడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్ ను ప్లాన్ చేసే పనిలో కలెక్టర్లు ఉండాలని స్పష్టం చేశారు.. ప్రజల్లో అత్యంత ప్రభావం కలిగించే వ్యక్తి కలెక్టర్.. కెరీర్‌లో కలెక్టర్… చీఫ్ సెక్రెటరీకి ఇవే ముఖ్యం అన్నారు..
Read Also: Kumal Kamra: కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే
ఇక, రొటీన్‌గా ఉంటే ఏడాది అవుతుంది.. మరో నాలుగేళ్లు కూడా గడిచిపోతాయి అన్నారు సీఎం చంద్రబాబు.. ఈ ప్రభుత్వం.. సంక్షేమం.. అభివృద్ధి.. సుపరిపాలన… ఈ మూడు గుర్తుండాలి.. ప్రజలు ఆనందంగా ఉండాలంటే సంక్షేమం కావాలి.. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది.. కేవలం పెన్షన్ల కోసం ఏడాదికి 33 వేల కోట్లు అవుతోందని వెల్లడించారు. అమరావతి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వామ్యం చేయాలన్నారు.. 20 లక్షల మందికి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తాం.. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్లు.. సోలార్ రూఫ్ టాప్ పై దృష్టి పెట్టాలన్నారు.. ప్రీ మాన్ సూన్ పోస్ట్ మాన్ సూన్ పై దృష్టి సారించాలి.. ప్రతి జిల్లా కలెక్టరు అరకు కాఫీ పై ఫోకస్ చేయాలన్నారు.. మరోవైపు, మే నెలలో తల్లికి వందనం ఇస్తాం.. త్వరలో విధి విధానాలు వస్తాయని తెలిపారు. 26 జిల్లాల కలెక్టర్ల పెర్ఫామెన్స్ పై సమీక్ష జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర 2047.. వికసిత్ భారత్ పై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు.. అందుకు అనుగుణంగా.. 175 నియోజకవర్గాలకు విజన్ డాక్యుమెంట్‌లు ఉంటాయన్నారు.. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి చైర్మన్ గా ఉంటారని తెలిపారు సీఎం చంద్రబాబు..