Minister Narayana: రాజధాని అమరావతి పునఃనిర్మాణం వైపు వేగంగా అడుగుల వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీ లాంచ్ కార్యక్రమానికి వస్తారని తెలిపారు మంత్రి నారాయణ.. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారన్నారు.. రాజధాని ప్రాంతంలో సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.. నిర్మాణంలో ఉన్న భవనాలు 115 కాగా.. సెక్రటరీలకు 90, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు 25 నిర్మాణాలు ఉన్నాయి.. 18 నెలల కాలంలో పూర్తి చెయ్యాలనే దిశగా సూచనలు చేశారు నారాయణ..
Read Also: Chennai: యూట్యూబర్ ఇంటిపై దుండగుల దాడి.. బకెట్ల కొద్దీ మురికి పారబోసి బెదిరింపులు
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికి అయినా రాజధాని అవసరం.. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ.. 43 వేల కోట్లకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచాము. అధికారులు ఎమ్మెల్యే ల భవనాలు.. మంత్రులు.. జడ్జీల భవనాలు దాదాపు పూర్తయ్యాయి. కానీ, గత ప్రభుత్వం ఇదేమి పట్టించుకోలేదు.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి.. ఐఐటీ మద్రాస్ ను పిలిచి బిల్డింగ్ నాణ్యత.. పరిశీలించి కాంట్రాక్టర్లు తో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం.. 90 శాతం పనులు టెండర్లు కంప్లీట్ అయ్యాయి.. మొదట క్లీనింగ్ తో పనులు మొదలు అయ్యాయి.. ఇవాళ సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ బంగళాలు పరిశీలించాం.. 186 బంగాళాలు మంత్రులు జడ్జీలు.. సెక్రెటరీలకు వస్తున్నాయి.. గెజిటెడ్ అధికారులకు 1440.. ఎన్జీవో లకుబ్1995 నిర్మాణాలు వస్తున్నాయి.. హై కోర్టు 16.85 లక్షల చదరవు అడుగులు వస్తుంది.. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తు లో వస్తుంది… పనులు 15 రోజుల్లో మొదలు అవుతాయి. మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి అని వెల్లడించారు.
Read Also: Raja Saab : రాజాసాబ్ షూట్ ఇంకా పెండింగ్.. రిలీజ్ డౌటే
ప్రజలపై భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందన్నారు నారాయణ.. వరల్డ్ బ్యాంక్.. ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నాం. ల్యాండ్ వాల్యు పెరిగిన తర్వాత.. అప్పు తీర్చడం జరుగుతుందన్నారు.. ప్రజల డబ్బు వేస్ట్ చేస్తున్నారు అని ప్రతిపక్షం చెబుతోంది. ఇది కరక్ట్ కాదని తెలిపారు మంత్రి నారాయణ..