Collectors Conference: కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది.. వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు జరగనుంది.. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది.. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పధకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పి.ఫోర్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చ జరగనుంది..
Read Also: Kunal Kamra: కునాల్ కమ్రాకు శివసేన శ్రేణులు బెదిరింపులు.. ఫోన్‌కాల్ వైరల్
ఇవాళ రేపు రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగనుండగా.. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.. అయితే, సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసంతో ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది.. తర్వాత సీఎస్.. రెవెన్యూ మంత్రి.. ఆర్ధిక మంత్రి ప్రసంగాలు ఉండనున్నరాయి.. తర్వాత సీఎం చంద్రబాబు.. కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.. ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్.. ఆర్టిజిఎస్.. ల్యాండ్ సర్వే.. వేసవి నీటి ఎద్దడి.. గ్రామీణ.. పట్టణ ప్రాంత నీటి సరఫరాపై చర్చించనున్నారు.. జిల్లా ల వారీగా యాక్షన్ ప్లాన్.. ముఖ్య సమస్యల ప్రస్తావన.. జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు.. రెవెన్యూ సమస్యలు.. భూ సమస్యలపై చర్చించనున్నారు.. రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు.. పాలనలో మార్పులు.. పీ 4 సంక్షేమ పథకాలు ప్రధాన అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. పీఎం సూర్య ఘర్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10 వేల ఇళ్లపై రూఫ్ టాఫ్ లు ఏర్పాటు చేయడంపై కూడా ప్రభుత్వం ఈ సదస్సులో ఫోకస్ పెట్టింది.. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కార్యాచరణ పై నివేదికలు సిద్ధం అయ్యాయి. ప్రతి మూడు నెలలకు ఒక సారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది.. దీనిలో భాగంగా ఇప్పటికే కుటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం.. నేడు, రేపు రెండు రోజులు పాటు మరోసారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది.. 15 శాతం వృద్ధే లక్ష్యంగా రానున్న ఏడాది కాలానికి రాష్ట్రంలోని 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను రెండు రోజుల పాటు అమరావతిలో జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించనున్నారు.. రెండు రోజుల ఈ సమావేశంలో మొదటి రోజు 9, రెండో రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తారు.. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటెషన్ ఇవ్వనున్నారు.. ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయించారు.. ఇందులో 10 నిమిషాలు కార్యాచరణ ప్రెజెంటేషన్, ఐదు నిమిషాలు సమస్యల వివరణ, ఇంకో ఐదు నిమిషాలు వాటిపై చర్చించనున్నారు.. తమ జిల్లాల్లో వివిధ సమస్యలను కలెక్టర్లు ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు.
Read Also: Robin Hood : ఏపీలో టికెట్ ధరలు పెంపు.. ఇప్పుడు అవసరమా..?
మొదటి రోజు భూముల వ్యవహారాలు, భూ సర్వేపై సీపీఎల్‌ఏ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. ఇప్పటికే రాష్ట్రంలో గత 5ఏళ్ల అనేక అక్రమాలు జరిగాయని భావించిన ప్రభుత్వం.. భూ అక్రమాలు చోటు చేసుకున్న జిల్లాలలో జిల్లా ఇంచార్జ్ మంత్రులు నుండి నివేదికలను గత సమావేశంలో కోరారు.. ఈ సమావేశంలో వాటిపైన చర్చిం చనున్నారు.. వీటితో పాటు నగర వనాలు, పచ్చదనం, ఎకో టూరిజంవంటి అంశాలపై అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. సంక్షేమ పథకాల అమలుపై ఆయా శాఖల కార్యదర్శుల ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.. పీ4 కార్యక్రమంపై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరించనున్నారు.. ఇక, వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. మరోవైపు, సీఎం చంద్రబాబు కీలకంగా భావిస్తున్న పీఎం. సూర్య ఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో పది వేల రూఫ్-టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ప్రణాళిక పై ఇంధన శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే విజయానంద్ ప్రజెంటేషణ్ ఇవ్వనున్నారు. తన తొమ్మిది నెలల పరిపాలన తీరుతెన్నులపై ప్రజాభిప్రాయాన్ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరించనున్నారు. రెండో రోజు సాయంత్రం 5 గంటల తరువాత గంట సేపు శాంతిభద్రతల పై చర్చించనున్నారు. సీఎం ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెడుతోంది.. గంజాయి.. మాదక ద్రవ్యాలు.. డ్రగ్స్ ఇలాంటి వాటి విషయంలో సీరియస్ యాక్షన్ ఉండాలని ఎస్పీలకి సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు…