Mega DSC 2025 Notification: నిరుద్యోగులకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొట్టిగా అమలు చేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కీలక అంశాలను ప్రస్తావించారు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు సదస్సుకు హాజరుకాలేదన్నారు.. అయితే, వచ్చే మూడు నెలలకు ఎలా పని చేయాలో ప్లాన్ చేసుకోవాలని సూచించారు.. ప్రజల్లో ఇంత ప్రేస్టేషన్ ఎప్పుడు రాలేదు.. అందుకే మొన్న ఎన్నికల్లో అంత మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు.. ఇక, ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు శుభావార్త చెబుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు పోస్టింగుల్లో ఉండాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
Read Also: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంని కలిసిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి.. ఎందుకంటే?
ఇక, కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణా అధికారులు అన్నారు సీఎం చంద్రబాబు. ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు.. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్ని విషయాలు ప్రస్తావించారు… విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు.. సోలార్ పవర్‌లో భాగంగా 20 లక్షల మందికి సోలార్ పవర్ ఇవ్వడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్ ను ప్లాన్ చేసే పనిలో కలెక్టర్లు ఉండాలని స్పష్టం చే శారు.. ప్రజల్లో అత్యంత ప్రభావం కలిగించే వ్యక్తి కలెక్టర్.. కెరీర్ లో కలెక్టర్… చీఫ్ సెక్రెటరీకి ఇవే ముఖ్యం అన్నారు.. రొటీన్‌గా ఉంటే ఏడాది అవుతుంది.. మరో నాలుగేళ్లు కూడా గడిచిపోతాయి.. ఈ ప్రభుత్వం.. సంక్షేమం.. అభివృద్ధి.. సుపరిపాలన… ఈ మూడు గుర్తుండాలి. ప్రజలు ఆనందంగా ఉండాలంటే సంక్షేమం కావాలి.. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది.. కేవలం పెన్షన్ల కోసం ఏడాదికి 33 వేల కోట్లు అవుతోందని వెల్లడించారు.