MLA Madhavi Reddy: కడప మేయర్ సురేష్‌బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవి.. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబు పై చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధికారం ఉందని అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. మేయర్ అవినీతి అక్రమాలు చేశారని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అయితే, తనకు ఇంత వరకు సోకాజ్ నోటీసు అందలేదని.. నోటీసులు అందిన వెంటనే స్పందిస్తానని పేర్కొన్నారు కడప మేయర్ సురేష్ బాబు.. తనపై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారని ఆరోపించారు.. ఇంత వరకు తనకు మాత్రం నోటీసు అందలేదని, అయితే వాళ్ల ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యే మాధవి.. బై హ్యాండ్ నోటీస్ తీసుకుని ఉండవచ్చనని అన్నారు.. కానీ, తనకు నోటీసు అందిన వెంటనే వాళ్లు చేసిన అవినీతి అక్రమాలను బయటపెడతానని వివరించారు కడప మేయర్ సురేష్ బాబు.. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్‌గా కడపలో పరిస్థితి తయారైన విషయం విదితమే..
Read Also: Tolly Wood : టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోన్న ఇద్దరు యంగ్ భామలు