YS Jagan: గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెంది రెండు నెలల్లో ఓ ఏడాది కావస్తుంది.. అప్పుడు వైసీపీ అధినేత జగన్ దగ్గర ఉన్నదేంటి.. ఇప్పుడు లేనిదేంటి.. 2019లో 151 సీట్లతో సీఎం పీఠాన్ని ఎక్కిన జగన్ మరో 30 ముప్పై ఏళ్ల పాటు ఏపీకి చెక్కుచెదరని పాలన అందిస్తామని చెబుతూ వచ్చారు.. అయితే ఆయన చెప్పినంత సులువుగా వైసీపీ పాలన సాగలేదు.. ముప్పై ఏళ్లు కాదు కదా.. కట్ చేస్తే రెండవ సారే ప్రతిపక్ష హోదా కోసం అధికార పార్టీతో పేచీలు పెట్టుకోవాల్సిన పరిస్థి ఏంటి.. 2014 లోనే అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆయన ధీమాగా ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు.. దీంతో ఆయనా నిరుత్సాహ పడలేదు.. మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు.. అధికార పక్షాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు.. ఫలితంగా అప్పడు కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేనలు మూడుదార్లు వెతుక్కోవాల్సి వచ్చింది.. జగన్ అధికారంలోకి రావటానికి ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర మంచి మైలేజ్ ఇచ్చింది.. ప్రజలకు జగన్ అంటే ఏంటో తెలిసేలా చేసింది.. మొత్తంమీద కష్టపడి పార్టీని అధికారం లోకి తీసుకురాగలిగారు జగన్.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని కుదురుకునే లోపే కరోనా రూపంలో ఓ పెద్ద విపత్తు వచ్చినా ప్రజలకు తాను అనుకున్న మంచిని జగన్ చేయగలిగారనేది అందరూ ఒప్పుకునే మాట..
Read Also: Saiee Manjrekar : మోడ్రన్ లుక్ లో మెలికలు తిరుగుతున్న మంజ్రేకర్
ప్రజలకు ఆయన డీబీటీ రూపంలో సంక్షేమ పథకాలను వాళ్ల ఇళ్లలోకి తీసుకు వెళ్లగలిగిన జగన్ వారితో యాక్సెస్ మాత్రం మిస్ అయ్యారు.. ఆయన సభలకు వచ్చినా.. సమావేశాలకు వచ్చినా అప్పటి వరకూ అధికారులు అవసరానికి మంచి అత్యుత్సాహంతో చేసిన ఏర్పాట్లు జనంతో జగన్ కు గ్యాప్ కు కారణమయ్యాయి.. ఆ తర్వాత జగన్ అధికారం కోల్పోవటం ప్రతిపక్ష పార్టీగా వైసీపీ మిగిలి పోయింది.. అయితే, కూటమి సర్కార్ ప్రజల అంచనాలకు తగినట్లుగా పాలన సాగటం లేదని.. సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు అందటం లేదని ఇటీవల వైసీపీ నిర్వహించిన ధర్నాలకు మంచి స్పందన రావటంతో ఆ పార్టీలో కొత్త ఊపును తీసుకు వచ్చింది.. పార్టీని వీడే నాయకులు వీడుతున్నా.. ప్రజల్లో వైసీపీ పట్ల నమ్మకం చెక్కుచెదరలేదని ఓ లెక్కకు వచ్చారు జగన్.. ఇటీవల ఆయన పులివెందుల పర్యటనలకు వెళ్లిన సందర్బంలో ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు భారీగా ప్రజలు తరలి రావటంతో అక్కడే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వచ్చారు.. పులివెందుల వెళ్లిన సందర్బాల్లో కచ్చితంగా ప్రజాదర్బార్ కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తూ వచ్చారు.. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా పార్టీ కార్యకర్తలు, నేతల తాకిడి ఎక్కువైంది.. జగన్ పార్టీ కార్యాలయంలో ఉంటే రోజుల్లో ఆయన చూసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే సంఖ్య ఎక్కువవుతోంది.. ఆయన తన దగ్గరకు వచ్చి కలిసిన వారితో మాట్లాడేందుకు కొంత సమయం కేటాయిస్తూ ఉండటంతో రోజులో ఎక్కువ మందికి ఆయనను కలిసేందుకు సమయం సరిపోవటం లేదు.. దీంతో ఆయన సెంట్రల్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పటివరకు కేవలం పులివెందుల నియోజకవర్గంలో మాత్రమే ప్రజాదర్బార్ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకునే జగన్.. ఇకపై తాడేపల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..
Read Also: Chennai: యూట్యూబర్ ఇంటిపై దుండగుల దాడి.. బకెట్ల కొద్దీ మురికి పారబోసి బెదిరింపులు
ఇలా ప్రజా దర్బార్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా ప్రారంభించారు.. ప్రజాదర్బార్ లో భాగంగా ప్రజలు వారి సమస్యలను తెలియజేయటానికి వీలుగా ఉంటుందని అప్పుడు రాష్ట్ర పరిస్థితుల పట్ల కూడా ఒక అవగాహన ఉంటుందని జగన్ భావిస్తునట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ఇలాగే ప్రజాధర్బార్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునేవారు ఇప్పుడు జగన్ సైతం రూటు మార్చి తన తండ్రి బాటలోనే పయనించేందుకు సిద్దమయ్యారిని తెలుస్తోంది.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రారంభమవుతుందని సమాచారం.. అయితే, గతంలో వైఎస్ తరహాలోనే కార్యక్రమాన్ని నిర్వహించటంతో పాటు ఆయనతో ఫోటోలు దిగేందుకు పెద్దఎత్తున అభిమానులు వస్తున్న నేపధ్యంలో ఫోటో సెషన్ కు కూడా ఆయన కొంత సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి.. అయితే ప్రజాదర్బార్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే తేదీలు వైసీపీ ప్రకటించనప్పటికీ అందుకు కావాల్సిన ఏర్పాట్లు మాత్రం చురుకుగా జరుగుతుండటంతో అతి త్వరలోనే ఉండవచ్చంటున్నాయి వైసీపీ వర్గాలు.. అయితే కీలక మార్పులతో ప్రజా సమస్యలు తెలసుకోవటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల ప్రజలను కలుస్తూ ఉండటం వల్ల సమస్యలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది.. ఏ సమస్య వచ్చినా ఆయనతో నేరుగా చెప్పుకోవచ్చనే భరోసా పార్టీ కార్యకర్తలకు ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారట.. మరి జగన్ స్ట్రాటజీలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయనేది చూడాలి..