వైఎస్సార్ కాంగ్రెస్.. మాస్ కాదు.. ఊర మాస్ ఇమేజ్ ఉన్న పార్టీ. దాదాపు ప్రతి చర్య, కార్యక్రమం ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంటాయి. అలాగే... పార్టీ కేడర్‌కు కూడా తమ అధినేత జగన్ అంటే పిచ్చి. అది ఎంతలా అంటే... చేసింది తప్పా, ఒప్పా అన్న దాంతో సంబంధం లేదు. జగనన్న చేశాడంటే... చెప్పాడంటే... అది కచ్చితంగా కరెక్ట్ అనుకునేంత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రేంజ్లో ఉన్న ఫీలింగ్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి వీలుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సాంకేతిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు.
అనంతపురంలో డిజిటల్ అరెస్టు పేరున డబ్బు డిమాండ్ చేసిన సైబర్ కేటుగాడిని రిటైర్డ్ ఉద్యోగి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఫోన్ చేసింది డిజిటల్ మోసగాడు అని గ్రహించిన రిటైర్డ్ ఉద్యోగి నారాయణ రెడ్డి నేరుగా అనంతపురం టు టౌన్ పోలీసులను ఆశ్రయించారు.. దీంతో డిజిటల్ నెరస్తుడి నుంచి తప్పించుకున్నాడు. ధైర్యంగా ఎదుర్కొన్న నారాయణ రెడ్డిని అనంతపురం టు టౌన్ సీఐ శ్రీకాంత్, సైబర్ క్రైం సీఐ జాకీర్ లు అభినందించారు.
గంజాయి సరఫరా చేసే వారికి కాకినాడ గేట్ వే గా మారింది.. నిత్యం జిల్లాలో ఏదో మూల గంజాయి మత్తు పదార్థాలు దొరుకుతూనే ఉన్నాయి.. ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం అన్ని రకాల రవాణా అనువుగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు.. గంజాయి తాగేవాళ్ళు ఎక్కువయ్యారని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.
టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించామని.. సీఎం ఆదేశాలు మేరకు మృతి చెందిన ఆరుగురు భక్తులకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని వెల్లడించారు.. ఇక, తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం.. గాయపడిన భక్తులకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం.. రేపటి నుంచి భాదిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాకు…
తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది.. సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తితో 30 రోజుల్లో విచారణ జరపాలని కోరారు పిటిషనర్.. ఇక, 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు ప్రభాకర్ రెడ్డి..
తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సుమోటోగా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ విజ్ఞప్తి చేశారు. సారీ చెప్పడం ద్వారా జరిగిన నష్టం నుంచి తప్పించుకోలేరని.. ప్రయశ్చిత దీక్ష సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది.. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు.. అంతేకాదు.. ఈ కేసులో బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు..