వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్కమిషన్ (ఏపీపీఎస్సీ).. 8 పోటీ పరీక్షలకు సంబంధించి.. తేదీలను వెల్లడించారు.. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ..
పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది. దేశవిదేశాల నుంచి అతిధులు తరలివచ్చే సమయం…
నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత నన్ను వదిలేయండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా నియోజకవర్గాన్ని కాపాడుకోకపోతే నాకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? అని ప్రశ్నించారు.. నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత నన్ను వదిలేయండి కామెంట్ చేసిన ఆయన.. అయితే, 15 ఏళ్లు తక్కువ కాకుండా కూటమి ఉండాలని ఆకాక్షించారు..
2025 - 26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ తయారీ పై ఆర్ధిక శాఖ కసరత్తు ప్రారంభించింది..వచ్చే మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి..దీనిలో భాగంగా వచ్చే ఏడాది బడ్జెట్ పై ఆర్ధిక శాఖ కసరత్తు ప్రారంభించింది..గత ప్రభుత్వ పాలనలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లకు భిన్నంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని కుటమి సర్కార్ భావిస్తోంది..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శుక్రవారం రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు పవన్ కల్యాణ్..
ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC)కి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ లేఖ రాయడం చర్చగా మారింది.. ప్రజా ప్రయోజనం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచవద్దు అంటూ ఏపీఈఆర్సీకి విజ్ఞప్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. వంద శాతం ఎలక్ట్రిక్ రైళ్లను నడపాలని ధ్యేయంగా పెట్టుకున్నాం.. కానీ, విద్యుత్ ఛార్జీలను పెంచితే సామాన్య ప్రజలపై.. ప్రయాణాల పైనా భారం పడుతుందని పేర్కొంది..
ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం.. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులే.. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేవారు.. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలన్నారు.. చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు. భయం లేదు. అందుకే శ్రీ వెంకటేశ్వరస్వామి వారి…
చాలా బాధాకరం అన్నారు సీఎం చంద్రబాబు.. తొక్కిసలాట వార్త మనసు కలచివేసిందన్న ఆయన.. శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు అని నా భావన.. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి తీసుకోదగ్గ చర్యలపై చర్చించాను.. మన చర్యల వల్ల దేవుని పవిత్రత దెబ్బ తినకూడదు.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.. తిరుపతిలో దర్శన టోకెన్లు ఇవ్వడం కొత్త సంప్రదాయం.. ఇది కరెక్ట్ కాదని భక్తులు భావిస్తున్నారని తెలిపారు.. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కొనసాగించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలియడం…
టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్త వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు..