తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా నిర్వహించేందుకు బెట్టింగ్ బాబులు సర్వం సిద్ధం…
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ జనవరిలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతాం. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ కు పూర్తి చేసేలా పని చేస్తున్నాం అన్నారు మంత్రి నిమ్మల.. 2017లో నిర్వాసితులకు రూ 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే.. మరలా ఇప్పుడు మరో రూ 800 కోట్లకు పైగా నిధులను అందించారని తెలిపారు..
సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ముందుగానే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మీడియాతో చిట్ చాట్లో ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాక్షించారు.. ఇక, పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలి అని సూచించారు.. నేను అందుకే మా ఊరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నాను అన్నారు.. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన వారికి అది ప్రేరణ అవుతుందన్నారు.. నేను…
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. అంతేకాదు.. దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.. మూడు రోజులు అయ్యింది, ఎందుకు పట్టించు కోవడం లేదు? సీఎం చంద్రబాబు,…
ఈ రోజు ఉదయమే పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉదయం 2 గంటల పాటు పవన్ కల్యాణ్ కోసం స్టాళ్లను తెరిచి ఉంచాలని ఆయన నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేవలం పవన్ కల్యాణ్ కోసం కొన్ని స్టాళ్లు ఆయన అడిగినవి తెరిచి ఉంచారు.. పవన్ కల్యాణ్ ఆయా స్టాళ్లను సందర్శిస్తూ.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథం కూడా కొనుగోలు చేశారు..
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.. రెండు రోజుల ముందే నగరానికి పండుగ శోభ సంతరించుకుంది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వటంతో విజయవాడ మీదుగా భారీగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది.
నెల్లూరు జిల్లాలో వైసీపీ బలోపేతంపై పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. నేతలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంపై హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అధినేత జగన్ స్వయంగా నేతలతో సమావేశాన్ని నిర్వహించి...పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాల నిర్వహణపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో సిద్ధం చేసిన కోడిపందాల బరులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు.