మందుబాబులకు పండుగ వేళ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు తగ్గుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగానే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
కృష్ణా జిల్లా కంకిపాడులో కోడి పందాల శిబిరం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కంకిపాడులో చలువాది రాజా ఆధ్వర్యంలో కోడి పందాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.. అక్కడ వణుకూరు - పునాదిపాడు కుర్రోళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. బీరు సీసాలతో కొందరు యువకులు వీరంగం సృష్టించారు.
రన్నింగ్ బస్సు టైర్ పేలి.. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నరాయి.. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.. బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలో టైర్ పేలడం కాకుండా.. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఇవాళ నారావారిపల్లెలో బిజీబిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయం కులదైవం నాగాలమ్మను ముఖ్యమంత్రి కుటుంబం దర్శించుకోనుంది. ఆ తర్వాత సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం.. బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహావిష్కరించనున్నారు చంద్రబాబు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఇవాళ లండన్ వెళ్లనున్నారు.. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి లండన్ బయల్దేరనున్నారు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మరో రోజు సెలవుగా ప్రకటించింది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో 73 జారీ చేశారు. అయితే, కనుమ రోజు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి చేయగా.. దీంతో, కనుమ రోజు అంటే జనవరి 15వ తేదీన ప్రభుత్వ సెలవుగా ఖరారు చేశారు..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పండగ సందడిలో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని పేర్కొన్న ఆయన.. భారతీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.. పల్లె సౌభాగ్యమే... దేశ సౌభాగ్యం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.