Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.. వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిలు పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు.. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ విజయవాడ 12 అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వంశీ పిటిషన్ డిస్మిస్ చేసింది.. ఇక, గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ మోహన్ ఏ71గా ఉన్నారు.. కాగా, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై మంగళవారం రోజు కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని.. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా.. వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మానవతా కోణంలో బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో విన్నవించారు.. అయితే, తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. ఈ రోజు వల్లభనేని వంశీ మోహన్‌తో పాటు.. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు..