సంక్రాంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.. వెంకటాపురం గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాకు.. ఆ తర్వాత మీడియాకు కూడా ఎక్కడంతో వైరల్గా మారిపోయాయి.. సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ సైకిల్ గుర్తు, కారు గుర్తులు వేసి తమ అభిమాన నాయకులు…
నేడు కనుమ పండుగ సందర్భంగా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం నిర్వహించనున్నారు. అంబాజీపేట మండలంలో ఏకాదశ రుద్రులు కొలువైన పదకొండు గ్రామాలలో ప్రభల ఊరేగింపులు కొనసాగనున్నాయి.. ఈ నేపథ్యంలో పి. గన్నవరం సీఐ భీమరాజు ఆద్వర్యంలో ప్రభల తీర్ధాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు. పందాల్లో గెలిచిన ఓడిన కోడిపుంజుకున్నా డిమాండే వేరు. ఓడిపోయిన కోడి కోస మాంసం తినడానికి ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. డ్రై ఫ్రూట్స్ మేతగా వేసి కోడిపుంజులను పెంచుతారు.. గనుక వీటి మాంసం టేస్టే వేరు.. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లుకు కోస టేస్ట్ కు లొట్టలేస్తారు.
పండగ వేళ పల్లెలు.. కిక్కిరిసిన జనంతో కొత్త కళను సంతరించుకుంటున్నాయి... ఇక కోడి పందేల్లో కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు కత్తికట్టి కాలు దువ్వుతున్నాయి. వీటి హవానే ఇన్నేళ్ల నుంచీ పందేల్లో కొనసాగుతుంది. ఈ సారి కూడా ఈ జాతి కోళ్లదే హవా నడుస్తోందని చెబుతున్నారు పందేం రాయుళ్లు. ఇక ఒక్కో పందెం వేల నుంచి లక్షల రూపాయల్లోకి వెళ్లిపోయింది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగులోగిళ్లలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.. అయితే, సంక్రాంతి పండుగ చేసుకోనటువంటి గ్రామం కూడా ఒకటి ఉందంటే అది ఆశ్చర్యం. ఆ గ్రామం ప్రకాశం జిల్లాలోనే ఉంది.. కొమరోలు మండలం ఓబులాపురం గ్రామంలో అంతా రివర్స్.. ఎక్కడైనా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊరికి వస్తుంటారు.. కానీ, సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సొంత ఊరు వదిలి ఇతర గ్రామానికి వెళ్తారు. రాష్ట్రమంతా ఉన్న ప్రజలు ఇతర గ్రామాల నుంచి స్వగ్రామాలకు వచ్చే సంక్రాంతి పండగ చేసుకుంటే మీరు మాత్రం ఇతర రాష్ట్రాలకు…
సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన జరిగిందని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఆ వేంకటేశ్వరుని దయతో దర్శనాలు చేసుకుని వెళ్తారన్నారు.. కూటమి ప్రభుత్వం జరిగిన ఘటనపై స్పందించిన తీరు సరికాదని.. క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమన్నారు.. బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. టీటీడీ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు.