Minister Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు దగ్గర ఉన్న సూర్యలంక బీచ్‌కు మహర్దశ పట్టబోతోంది.. సహజమైన తీరం, స్ఫటికం-స్పష్టమైన జలాలు, సూర్యోదయాలకు ప్రసిద్ధి చెందిన ఒక అద్భుతమైన ప్రదేశం సూర్యలంక బీచ్.. అయితే, సూర్యలంక బీచ్ కి మహర్దశ వచ్చేసింది.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి సూర్యలంక బీచ్ కు నిధులు ఇవ్వమని కోరారు మంత్రి కందుల దుర్గేష్.. ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం, పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది ఏపీ పర్యాటక శాఖ.. ఇక, సూర్యలంక బీచ్ లో మౌలిక వసతులు కల్పించి పరిశుభ్ర బీచ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్..
Read Also: US visa: ఆ కారణంతో.. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను రద్దు చేసిన అమెరికా