ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్న నారా లోకేష్.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఈ రోజు రాత్రికి భేటీ కానున్నారు. ఇటీవల రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలపనున్నారు.
గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..
మరికొన్ని పథకాలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు..
ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో ముందుకుపోతోంది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం లెక్క ఎంత అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. రాష్ట్రంలో 3 కోట్ల 54 లక్షల మంది ఇచ్చిన వివరాలు సర్కారు దగ్గరున్నాయి.
పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అయితే అదేసమయంలో.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలుదపాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇంచార్జి మంత్రులకు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కోనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ టార్గెట్‌గా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... ప్రచారం మాత్రం కచ్చితంగా ఆయనకు బీజేపీ పరంగా వచ్చే అవకాశాల్ని దెబ్బ తీస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ఈటలను కేంద్ర బిందువుగా చేసుకుని జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా? లేక ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అన్న ఆరాలు పెరిగిపోతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
జమ్మలమడుగు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటాయి. ఇప్పుడిక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండటం కాక రేపుతోంది. ఒకరిది ఇప్పుడు కాకున్నా... గతంలో ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఉన్న ఫ్యామిలీ. మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం. జమ్మల మడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న రాజకీయం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొత్త సమీకరణలకు దారి తీస్తోందని అంటున్నారు.