అనేక ట్విస్టుల నడుమ నందిగామ మున్సిపల్ చైర్మన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు.. నిన్నే చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇవాళ ఎన్నిక జరిగింది.. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మూడో వ్యక్తిగా మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం సూచించడంతో ఆమెను కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు.. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు..
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. విజయం మీదా..? మాదా? అనే ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరకు తిరుపతి డిప్యూటీ మేయర్ పోస్టును తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ-భారతీయ జనతా పార్టీ కూటమి కైవసం చేసుకుంది..
ఎన్నిలక కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఫిబ్రవరి 13న నామినేషన్లు ఉపసంహరణకు గడువుగా పెట్టింది ఎన్నికల కమిషన్.. ఇక, ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఎమ్మెల్యేగా తాను సూచించిన కౌన్సిలర్ సత్యవతి పేరు పై బీఫామ్ వస్తుందని ఆశించారు తంగిరాల సౌమ్య.. అయితే, ఎమ్మెల్యే సౌమ్యకు మరోసారి షాక్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహిస్తోంది.. బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు.. ఆ తర్వాత ఈ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చించేందుకు సిద్ధమయ్యారు.
వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ తొలిదశ ముగిసింది.. నిన్న న్యాయ విచారణ కమిషన్ ముందు కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడో రోజు హాజరయ్యారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.. పద్మావతి పార్కులో ఎంత మంది భక్తులు వేచిఉండే అవకాశం ఉంది.. లోపలికి ఎంతమందిని పంపారని కలెక్టర్ వెంకటేశ్వర్లను కమిషన్ ప్రశ్నించింది.
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు..