Union Minister Pemmasani Chandrasekhar: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణం వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆర్‌వోబీ నిర్మాణంతో భూములు కోల్పోయే 21 మందికి 70 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఆర్‌వోబీపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దన్నారు. మొదట ఆర్‌యూబీ నిర్మాణం చేసి తర్వాత ఆర్వోబీ నిర్మాణం చెయ్యడం కుదరదని చెప్పారు. అండర్ పాసులు, సర్వీస్ రోడ్లు ఉండేలా నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్..
Read Also: Yemen War Plan Leak: యెమెన్ వార్ లీక్‌లో బిగ్ ట్విస్ట్! అసలేం జరుగుతోంది..!
గుంటూరులో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. శంకర్ విలాస్ బ్రిడ్జి ఆరు దశాబ్దాల క్రితం నిర్మించారు. కేంద్రమంత్రి పదవి రావడంతో కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి వేగంగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు, నిధులు తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలు, అధికారులు అందరి సహకారంతో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. విశాల దృక్పధంతో ఆలోచించాలని సూచించారు.. మిగిలినవారు కూడా అదేవిధంగా ఆలోచించాలి. ఆర్.యూ.బి. కట్టాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆర్వోబీ కట్టాలంటే మళ్లీ ఆర్.యు.బి. క్లోజ్ చెయ్యాలి. ఇది జరిగేపని కాదన్నారు.. మొదట్లో నన్ను నాలుగైదుసార్లు కలిస్తే వారిచ్చిన సలహాలన్నీ తీసుకున్నాం. అండర్ పాసులు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్.యు.బి. కూడా నిర్మించుకోవచ్చు. ప్రస్తుత ఆర్.ఓ.బి. నిర్మాణంతోనే కొంతమంది భూములు కోల్పోతున్నారు. సర్వీస్ రోడ్లు లేవంటున్నారు… 27అడుగులతో సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఇది అందరం సొంత ప్రాజెక్టులా భావించి తప్పులు జరగకుండా చూస్తున్నాం. వీలైనంత తక్కువ సమయంలో ఆర్.ఓ.బి. పూర్తి చేస్తాం. ఎవరూ ఆర్.ఓ.బి. నిర్మాణానికి అడ్డుపడొద్దు అని విజ్ఞప్తి చేశారు పెమ్మసాని చంద్రశేఖర్.