ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ మంత్రులకు టార్గెట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 27న ఏపీలో రెండు గ్రెడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.. ఇంఛార్జ్ మంత్రులు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుండగా.. మంత్రివర్గంలో కీలక అజెండాపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు షాక్ ఇచ్చింది రైల్వేశాఖ.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్త మెలిక పెట్టింది. సెంటిమెంట్‌ను గౌరవించి 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ కొనసాగిస్తూనే.. కీలక మార్గాలలో కోత పెట్టింది. కార్గో, అరకు పర్యాటక అభివృద్ధికి కీలకమైన కొత్త వలస - కిరండోల్ మార్గం ఒడిషా పరిధిలోకి వెళ్ళిపోనుంది.
ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకున్నారు.. అయితే, దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శనను వాయిదా వేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ.. సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రతీ గ్రామంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేసి, గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు..
ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుందని తెలిపారు.. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్న ఆయన.. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలపెడతా.. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రయివేటు కేసులు వేస్తాం అని వార్నింగ్…
సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు.. ఈ కేసులో దేవి రెడ్డి శంకర్ కొడుకు చైతన్య రెడ్డితో పాటు, గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాశంపై కేసు నమోదైంది..
కోళ్లకు అంతుచిక్కని వ్యాధిపై గోదావరి జిల్లాల పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీలకు ఈ వ్యాధి లేకపోయినా కొన్నిచోట్ల జాడ కనిపిస్తుంది. అంతుచిక్కని వైరస్ కోళ్లకు వ్యాపించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయంపై కసరత్తు చేస్తోంది.. త్వరలో రాష్ట్ర బడ్జెట్ 2025-26 కూడా ఉండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆదాయార్జన వాఖలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.