ఎన్టీఆర్‌కు భారతరత్నపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అలియాస్ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, ఆయన కుమారుడైన టీడీపీ ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణను ఈ మధ్యే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ వరించింది.. అయితే, ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.. నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలని వ్యాఖ్యానించారు.. నాకు పద్మభూషణ్ అవార్డు కంటే.. […]
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఇవాళ కూడా ఎన్నికల ప్రక్రియ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్
తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయడానికి ప్లాన్ చేశాడో ఓ వ్యక్తి.. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు.. అయితే, హత్య చేసేందుకు రెక్కి చేస్తుండగా నిందితులను అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు.. ఈ కేసు వివరాలను నందిగామ ఏసీపీ తిలక్ మీడియాకు వెల్లడించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్).. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు వి. శ్రీనివాసరావు.. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఇక, 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు.. 15 మందితో నూతన కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నారు..
నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలని వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ.. నాకు పద్మభూషణ్ అవార్డు కంటే.. నాన్నకు భారతరత్న అవార్డు రావాలని అనేది కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆకాంక్షగా పేర్కొన్నారు.. కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అలెర్ట్ అయ్యింది.. బడ్జెట్ లో రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనాలు.. నిధులకు సంబంధించి మద్యాహ్నం 3 గంటలలోగా నివేదిక ఇవ్వాలని అన్నిశాఖలకు ఆర్ధికశాఖ సూచనలు చేసింది.. అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది ఆర్థిక శాఖ.
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని కొండల్లోకి లోడ్‌తో ఉన్న కంటైనర్‌తో వెళ్లిపోయాడు ఓ డ్రైవర్.. కర్ణాటక రాష్ట్రం నుండి తాడిపత్రికి ఐరన్ లోడుతో బయలుదేరింది కంటైనర్.. అయితే, రాత్రి సమయంలో దారి తెలియక గూగుల్ మ్యాప్‌ని ఆన్ చేశాడు డ్రైవర్ ఫరూక్.. ఇక, ఆ మ్యాప్‌ను ఫాలో అయిపోయాడు.. అది సరాసరి యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి తీసుకెళ్లింది.. తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత లోయలోకి ఒరిగిపోయింది ఆ భారీ కంటైనర్..
ఈ ఏడాది బులియన్ మార్కెట్ ధరలు మిశ్రమంగా ఉంటాయని.. ఆర్థిక సర్వే అంచనా వేసింది.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత.. సభలో ఆర్థిక సర్వేలను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అయితే, ఈ ఏడాది బులియన్ మార్కెట్ దరలు మిశ్రమంగా ఉంటాయని అంచనా వేసింది.. ఈ సమయంలో పడిసి ధరలు తగ్గుతాయని పేర్కొంది.. ఇక, బంగారం ధరలు తగ్గినా.. వెండి ధర మాత్రం మరింత కొండెక్కుతుందని స్పష్టం చేసింది..
జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు.. ఐర్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం స్థానికంగా విషాదాన్ని నింపింది. జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్.. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్తుండగా.. చెట్టును ఢీకొట్టింది కారు.. ఈ ప్రమాదంలో భార్గవ్ మృతి చెందాడు..