పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్..
తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చెయ్యడం సంతోషం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలో ఏ ఇజం లేదు టూరిజం ఒక్కటే అని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారన్నారు.. కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్నే ప్రస్తావించారు సీఎం.. టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. పార్లమెంట్ను తాకిన మద్యం కుంభకోణం వ్యవహారంపై చర్చించనట్టుగా తెలుస్తోంది.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందంటూ.. ఇటీవల పార్లమెంట్ లో లేవనెత్తారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. నాలుగు వేల కోట్ల రూపాయల సొమ్మును విదేశాలకు తరలించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్షాని సైతం కలిసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు.. మద్యం కుంభకోణంపై చర్చించారట..
మేయర్ పై అవిశ్వాస తీర్మానం తర్వాత గ్రేటర్ విశాఖ పరిణామాలు మరింత ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. నోటీసులు ఇచ్చేసిన కూటమి సంఖ్యాబలం కోసం మల్లగుల్లాలు పడుతోంది. లెక్క తప్పితే పరువుపోతుందనే టెన్షన్ టీడీపీలో కలవరం పెంచేస్తుంటే.. క్యాంప్ పాలటిక్స్ మొదలెట్టిన వైసీపీ.. ఇది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని ధీమాగా కనిపిస్తోంది.
మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారట.. హైదరాబాద్లో ఉన్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు.. ఛాతిలో నొప్పిరావడంతో.. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది.. జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ గోపవరం జడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి... తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ శాఖ అధికారులు.. ఈ నెలాఖరు వరకు అంటే 31 ఏప్రిల్ 2025 దాకా పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ మున్సిపల్ శాఖ..