ఇక, యుద్ధాన్ని ముగించండి అంటూ భారత, పాకిస్తాన్ ప్రధానులకు విజ్ఞప్తి చేశారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ.. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ కాల్పుల్లో పిల్లలు, మహిళలు చిక్కుకుపోవడానికి వారి చేసిన తప్పు ఏమిటి? అని ప్రశ్నించారు.. సైనిక చర్య సమస్యను పరిష్కరించదని అభిప్రాయపడిన ఆమె.. ఇది ఎప్పుడూ సమస్యను పరిష్కరించదు.. శాంతిని అందించదు అన్నారు...
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు.. జమ్మూ కాశ్మీర్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు.. పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్ మురళీ నాయక్.. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా.. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాట్లు చేసింది..
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో.. వార్ బ్లాక్ అవుట్ వెలుగులోకి వచ్చింది.. బ్లాక్ అవుట్ అంటే ఏంటి..? అసలు ఎందుకు ఇది అమలు చేస్తారు? అనేది ఇప్పుడు చర్చగా మారింది.. అసలు Wartime Blackout అంటే ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. శత్రువుల నిఘా నుంచి.. వాళ్ల దాడుల నుంచి.. ప్రజలను రక్షించడానికి భద్రతా చర్యల్లో భాగంగా ప్రకటించేదే వార్‌టైమ్ బ్లాక్అవుట్..
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు.. దాడులు, ప్రతిదాడుల సమయంలోనూ మేడిన్ చైనా ఆయుధాలు తుస్సుమంటున్నాయట.. దీంతో.. మేడిన్ చైనా వస్తువులే కాదు మిస్సైల్స్ కూడా తుస్సే అని నిరూపితమైందంటున్నారు.. దీనిపై డ్రాగన్ కంట్రీని సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు నెటిజిన్లు..
తిరుమలలో మరోసారి కలకలం రేగింది.. ఇవాళ ఉదయం నుంచి శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.. ప్రతి నిత్యం తిరుమల కొండ పై ఆలయానికి సమీపంలో తరుచూ విమానాలు వెళ్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు..
ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి కీలక సూచనలు వచ్చాయని ప్రకటించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్.. దాడి జరిగే అవకాశం ఉందని వైమానిక దళ కేంద్రం నుండి వైమానిక హెచ్చరిక అందింది.. సైరన్లు మోగుతున్నాయి.. అందరూ ఇంటి లోపలే ఉండండి.. ఇంట్లో బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్..
పాక్ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడతాయి..
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పాక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్.. పాక్ యుద్ధం కోరుకుంది.. దానికి భారత్ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నాడు.. 'ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉండాలి.. కానీ, ఆ అవకాశాన్ని వదులుకొని యుద్ధం కోరుకుంటుంది.. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాదు.. వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేశారు.. దానికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది.. పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు వీరేంద్ర సెహ్వాగ్..
నిన్న రాత్రి, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) మరియు అంతర్జాతీయ సరిహద్దులు (IB) వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్లను పంపడానికి పాక్ విఫలయత్నం చేసింది.. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్‌కోట్ ప్రాంతాలలో పాక్ చర్యలకు భారత్ తిప్పికొట్టింది.. భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు ఉపయోగించి.. పెద్ద ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్‌లో 50కి పైగా పాక్ డ్రోన్లను విజయవంతంగా తటస్థీకరించింది..