ఏపీలో లేని లిక్కర్ స్కాం పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని.. ఇప్పుడు ఆయనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో ఒక రకంగా జగన్ ను ముద్దయిని…
మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో - ఏపీఎస్ఎస్ డీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.. ఒప్పందం ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు..
కడప మేయర్ సురేష్‌బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవి.. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబు పై చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధికారం ఉందని అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. మేయర్ అవినీతి అక్రమాలు చేశారని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి.. దీంతో, తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం..
కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణా అధికారులు అన్నారు సీఎం చంద్రబాబు. ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు.. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్ని విషయాలు ప్రస్తావించారు... విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు..
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు శుభావార్త చెబుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు.. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు పోస్టింగుల్లో ఉండాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
మాజీ సీఎం జగన్ తన స్ట్రాటజీలు మారుస్తున్నారట.. పార్టీతో పాటు పార్టీ కార్యాలయాల్లోనూ కీలక మార్పులు చేపట్టబోతున్నారట.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆ కీలక మార్పులను చూడవచ్చంటున్నారట..