YS Jagan: ఒక్క విషయం గుర్తుంచుకొండి.. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను.. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు.. ఇప్పటికే ఏడాది గడిచింది.. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది… అప్పుడు మీకు సినిమా చూపిస్తాను.. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాను ని హెచ్చరించారు.. సీఐ రాజేష్‌పై ప్రైవేటు ఫిర్యాదు చేస్తే, కేసు పెట్టాలని కోర్టు ఆదేశించినా, ఇప్పటికీ కేసు పెట్టలేదన్నారు.. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు.. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారని వ్యాఖ్యానించారు..
Read Also: Mahabubabad: భూమి తగాదా.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముళ్లు..
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా పక్కకు పోయి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది,, అందుకు నిదర్శనం నా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు (వెంకటేశ్వరరావు) అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు, ఈ గ్రామానికి ఉప సర్పంచ్ అన్నారు జగన్.. రెంటపాళ్లలో కొర్లకుంట వెంకటేశ్వరరావు ఈ గ్రామంలో నాయకుడు. ఆయన కొడుకు ఉప సర్పంచ్. పోలింగ్ మొదటి రోజు నుంచి టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేసింది ఇక్కడ కనిపిస్తోంది. పోలింగ్‌కు ముందు వారికి అనుకూలురైన అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నారు. పోలింగ్ రోజున ఐజీ, ఎస్పీ అందరు అధికారులు టీడీపీ గెలుపు కోసం ఎలాంటి అన్యాయాలు చేశారనేది అందరికీ తెలుసు అన్నారు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున, 2024, జూన్ 4న అల్లర్లు చేస్తారని చెప్పి, టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి, నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోయి, అక్కడే ఉంచారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే ఆయన్ను సెల్‌లో వేశారు. ఆ తర్వాత వెంకటేశ్వరరావు ఇంటిపై టీడీపీ, జనసేన కార్యకర్తలు రాళ్లు వేశారు. అలాగే ఆయన ఊరు విడిచిపెట్టి పోవాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కాల్చి చంపుతామని సీఐ రాజేష్ బెదిరించారని.. జూన్ 4న కౌంటింగ్ జరిగితే, మర్నాడు రాత్రి వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్ సెల్‌లోనే ఉంచి, బెదిరించారు. 5వ తేదీ రాత్రి విడిచిపెట్టారు. దాంతో ఆయన గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కణ్నుంచి, వాళ్ల నాన్నకు ఫోన్ చేసి, పోలీసులు తనను ఏ విధంగా తనను అవమానించారు? బెదిరించారు? కొట్టారనేది అన్నీ చెప్పి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్లాడు. వెంటనే వెంకటేశ్వరరావు గుంటూరు వెళ్లి, కొడుకును ఆస్పత్రిలో చేర్పిస్తే, జూన్ 9న చనిపోయాడు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఇప్పుడు ఆయన భార్య, కూతురుకు ఏం సమాధానం చెబుతారు చంద్రబాబు? అంటూ నిలదీశారు..
Read Also: Sonam Raghuvanshi Case: మేఘాలయలో భర్త హత్య.. సోనమ్‌ని పట్టించిన ‘‘వాట్సాప్’’
ఆయన మీ పార్టీకి అనుకూలంగా లేరన్న ఒకే ఒక కారణంతో, కుల ప్రస్తావన తెచ్చి, అవమానించి, కొట్టి వేధించారు అని విమర్శించారు జగన్.. ఏడాది నుంచి ఈ కుటుంబం శోకంలోనే ఉంది.. వారి ఇంటిపై దాడి చేసిన వారిలో ఎంత మందిపై కేసు పెట్టారు? ఎందరిని అరెస్టు చేశారు? ఆ సీఐపై ఎలాంటివ చర్య తీసుకున్నారో చెప్పండి.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో చివరకు వెంకటేశ్వరరావు ప్రైవేటు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు అని దుయ్యబట్టారు.. చంద్రబాబు ముఠా.. రాష్ట్రాన్ని దోచుకోవడం. అదే మీ పని. గజదొంగలుగా దోచుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు అన్నారు.. చంద్రబాబును ఎవరైనా కమ్మ వారు వ్యతిరేకిస్తే, వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసులకన్నా దారుణం అన్నారు.. మా పార్టీలో ‘కమ్మ’ కులస్తులపై ఎందుకీ కక్ష? అని మండిపడ్డారు జగన్.. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నాడు.. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు.. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని ఇన్ని రోజులు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో లోపల ఉంచేస్తున్నారు. రెండు నెలలకు పైగా చంద్రబాబు శాడిజమ్‌తో వంశీ జైల్లో మగ్గుతున్నాడు. ఏం పాపం చేశాడని, మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు? మా పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై 9 కేసులు పెట్టి వేధిస్తున్నారు?