నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్ పరామర్శ.. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఘటన..!
పల్నాడు జిల్లా పర్యటనలో రెంటపాళ్ళ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్న.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం పక్కకుపోయి.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. అందుకు నిదర్శనం నాగమల్లేశ్వరావు ఘటనే అన్నారు. రెంటపాళ్ల నా పర్యటన అందుకు కారణం అన్నారు జగన్.. ఇక, నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యపై వివరిస్తూ.. రెంటపాళ్లలో నాగమల్లేశ్వరావు వైసీపీ నాయకుడు.. గ్రామ ఉప సర్పంచ్.. పోలింగ్ రోజునుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారు. వారికి అనుకూలంగా వున్నవారికి పోస్టింగ్ ఇప్పించుకున్నారు.. 2024 జూన్ లో కౌంటింగ్ రోజున తప్పుడు ఆరోపణలు చేసి నాగమల్లేశ్వరావు ను స్టేషన్ కు తీసుకెళ్ళారు.. ఫలితాలు వచ్చాక నాగమల్లేశ్వరావును ఊర్లోకి రావడానికి వీల్లేదని సీఐ రాజేష్ చెప్పారు.. కాల్చి చంపుతామని బెదిరించారు.. జూన్ 5 వరకూ స్టేషన్ లో ఉంచి అవమానించారు, బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా..? ఎందుకీ కక్ష..?
మా పార్టీలో ‘కమ్మ’ కులస్తులపై ఎందుకీ కక్ష..?.. కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా? అని సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలను నిలదీశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనలో రెంటపాళ్ళలో పర్యటించిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. వైసీపీ నేత నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏం పాపం చేశారని మా పార్టీలోని కాపు నేతలను ఇబ్బంది పెడుతున్నారు..? అని మండిపడ్డారు.. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇన్ని రోజులుజైల్లో పెట్టారు.. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో జైలుకు పంపిస్తున్నారు.. ఏం పాపం చేశారని కొడాలి నానిని హెరాస్ చేస్తున్నారు.. దెందులూరు కు చెందిన అబ్బయ్యచౌదరిపై తొమ్మిది కేసులు పెట్టారు.. దేవినేని అవినాష్ కమ్మ సామాజిక వర్గంవాడని కేసులమీద కేసులుపెట్టి హింసిస్తున్నారు.. తలశిల రఘురాం ఎమ్మెల్సీ పై ఏం చేశారని మూడు కేసులు పెట్టారు.. ఎంవీవీ సత్యనారాయణ మాజీ ఎంపీని వ్యాపారాలు చేసే అవకాశం లెకుండా చేశారు.. నంబూరు శంకరరావు మాజీ ఎమ్మెల్యే పై తప్పుడు కేసులు పెట్టారు.. బొల్లా బ్రహ్మనాయుడు, శివకుమార్ పై తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు వైఎస్ జగన్..
నా అరెస్ట్ అక్రమం.. నోటీసు కూడా ఇవ్వలేదు..
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు.. ఏపీలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చే ముందు.. విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు.. ఈ సందర్భంగా నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయం సిట్ అధికారులకు కూడా తెలుసు.. ఇది మంచి పద్దతి కాదు.. నాకు నోటీసు కూడా ఇవ్వలేదు.. నిన్న సాయంత్రం FIRలో నా పేరు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు.. నా అరెస్ట్ అక్రమం అన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. ఇక, అంతకుముందు చెవిరెడ్డిని లిక్కర్ స్కాం కేసులో మూడున్నర గంటలపాటు విచారించారు పోలీసులు.. లిక్కర్ స్కాం కేసులో నిందితులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు.. సిట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు దాటవేసినట్టుగా తెలుస్తోంది.. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పరిచయంపై ప్రశ్నించిన సిట్.. లిక్కర్ స్కాం అక్రమ నగదు పలుప్రాంతాల్లో ఎన్నికల్లో పంపిణీ చేయుడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర వహించినట్లు సిట్ గుర్తించింది.. రెండు గంటలపాటు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును కలిపి విచారించారట సిట్ అధికారులు.. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి పాత్ర, సాక్ష్యాలు ఎదురు పెట్టి మరీ ప్రశ్నించారట.. అయితే, కేసుతో తనకు సంబంధం లేదని సిట్ అధికారులకు సమాధానం ఇచ్చారట చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి..
మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా..! జగన్ మాస్ వార్నింగ్..
ఒక్క విషయం గుర్తుంచుకొండి.. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను.. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు.. ఇప్పటికే ఏడాది గడిచింది.. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది… అప్సుడు మీకు సినిమా చూపిస్తాను.. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాను ని హెచ్చరించారు.. సీఐ రాజేష్‌పై ప్రైవేటు ఫిర్యాదు చేస్తే, కేసు పెట్టాలని కోర్టు ఆదేశించినా, ఇప్పటికీ కేసు పెట్టలేదన్నారు.. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు.. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారని వ్యాఖ్యానించారు..
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలు..
హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమైన లోకేష్.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణలను కేంద్రమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేసి, వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. 700 యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేశాం. అకడమిక్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. ఎటువంటి రాజకీయం జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికను ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను విజయవంతంగా పూర్తిచేశామని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు టీజీ సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచన..!
ఏపీ సీఎం చంద్రబాబుకి టీజీ సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచన చేశారు. మోడీ మీరు చెప్తే వినొచ్చు.. కానీ మా ప్రయోజనాలు వదులుకోలేమని రేవంత్‌రెడ్డి అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంపై సీఎం రేవంత్ మాట్లాడారు. మా హక్కులు హరిస్తే న్యాయ స్థానాలు ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. మిగులు జలాలు 3 వేల టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి అనుకుంటే.. మా 968 టీఎంసీల వాటా వాడుకునేందుకు క్లియర్ చేయాలని సూచించారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల మీకు నీళ్ళు వస్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టులు మంచిగా కడితే.. స్టోరేజ్ చేసుకోగా.. వరద ఎంత వస్తుందో తెలిసేదన్నారు. మీరు గ్యాప్ పెంచుకుంటే మంచిది కాదని చంద్రబాబును ఉద్దేశించి రేవంత్‌రెడ్డి అన్నారు. మాకు కేటాయించిన నీటి వినియోగానికి ఎన్‌ఓసీ ఇవ్వాలన్నారు. వ్యక్తులుగా కాదు.. రెండు రాష్ట్రాలుగా ఆలోచించాలని సూచించారు. కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ఒత్తిడి తో.. కిషన్ రెడ్డి తప్పించుకున్నారన్నారు.. రేపు కేంద్ర మంత్రిని కలుస్తామని.. కిషన్ రెడ్డి కూడా రావాలని కోరారు.
కేసీఆర్, జగన్ ఒప్పందం వల్లే ఏపీలో ప్రాజెక్టులు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్, జగన్ ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బేసిన్‌లు లేవు భేషజాలు లేవు అన్న కేసీఆర్ మాటలను గుర్తు చేశారు. తాజాగా ప్రాజెక్టుల అంశంపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీఎం మాట్లాడారు. గోదావరి జలాలు పెన్నాకు తీసుకెళ్తా అని చెప్పి.. ఏపీని ప్రోత్సహిస్తాం అని చెప్పింది కేసీఆర్ అని తెలిపారు. ఇప్పుడు ఏపీ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తుంటే.. బీఆర్ఎస్ వాళ్లు రివర్స్‌లో తమపై నిందలు వేస్తున్నారన్నారు. ఏపీ సీఎం 300 టీఎంసీల ప్రణాళికా సిద్ధం చేసుకుంటున్నారని వెల్లడించారు. 400 టీఎంసీలు తీసుకుపో అని కేసీఆర్ ప్లాన్ చేశారన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని.. తాము రాసిన లేఖకు కేంద్రం నుంచి రిప్లై కూడా వచ్చిందని స్పష్టం చేశారు. తాము ఎక్కడా బాధ్యత నుంచి తప్పుకోలేదన్నారు… పాపానికి పునాది వేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. శిక్ష వేయాల్సింది హరీష్, కేసీఆర్‌కి.. ఉరి తీయాల్సి వస్తే ఇద్దరికి వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మతతత్వ శక్తులకు రాహుల్ గాంధీ రక్షణ..
అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు ఎల్లప్పుడూ మతతత్వ శక్తులను రక్షించాలని కోరుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరేసిన సంఘటనల్లో పాల్గొన్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో ఇలాంటి సంఘటనలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ఈ సంఘటనలు, ఘర్షణలు బీజేపీ ప్రభుత్వ నిఘా వైఫల్యాలను బయటపెట్టాయని పేర్కొన్నారు. ఆయన చేసిన విమర్శలపై సీఎం మాట్లాడుతూ.. మాంసాన్ని ఆలయాల్లో ఉంచవచ్చని చెప్పడానికి ప్రయత్నించే వారిపై స్పందించడానికి కూడా అర్హులు కాదని అన్నారు. అలాంటి వ్యక్తులు భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని విలేకరుల సమావేశంలో శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రపంచం పెను విపత్తు ముందుంది’’.. ఇజ్రాయిల్-ఇరాన్ ఘర్షణపై రష్యా..
ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఈ రెండు దేశాలు గత 6 రోజులుగా వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. మిడిల్ ఈస్ట్ సంఘర్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడుల తర్వాత ‘‘ప్రపంచం విపత్తుకు మిల్లీ మీటర్ల దూరంలో ఉంది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా బుధవారం అన్నారు. రష్యా, యూఏఈ ఈ సంఘర్షణ ముగియాలని కోరుకుంటున్నట్లు క్రెమ్లిన్ పేర్కొంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం గురించి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య వివాదానికి వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు అంగీకరించారని రష్యా తెలిపింది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిష్కారం కనుగొనేందుకు మధ్యవర్తిగా పనిచేయడానికి రష్యా సంసిద్ధంగా ఉందని పుతిన్ అన్నారు.
నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ కూడా ఎంతో కీలకం. ఫీల్డింగ్ లో ఒక్క తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. అయితే, ఈ క్రమంలో కొన్నిసార్లు ఆటగాళ్ల నుంచి అనుకోకుండా నవ్వులు పుట్టించే ఘట్టాలు కూడా చోటుచేసుకుంటాయి. అలాంటి ఒక సరదా సంఘటన తాజాగా కేరళ ప్రీమియర్ లీగ్ (Kerala Premier League)లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో KPA 12, KCSA Calicut జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బౌలర్ వేసిన బంతి బాట్స్‌మెన్‌ను ఔట్ చేసేలా లెగ్ సైడ్‌కు స్వింగ్ అయింది. అలా వేసిన బాల్ ను బాట్స్‌మన్ బ్యాట్ తాకి బంతి వికెట్ కీపర్ వైపు వెళ్ళింది. దానితో అటుగా వెళ్తున్న వికెట్ కీపర్ బంతిని పట్టేందుకు వైపు డైవ్ చేసాడు. కానీ బంతిని అందుకునే క్రమంలో అతని గ్లవ్స్ నుండి జారిపోతూ గాల్లోకి ఎగిరి.. చివరికి తన వీపుపై పడింది. అలా పడిన బంతిని కింద పడకుండా నడుముపై బ్యాలెన్స్ చేసాడు.
జూలై4 నుంచి ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’ స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోనీ లివ్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, కుకునూర్ మూవీస్‌తో కలిసి, ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన పుస్తకం నైంటీ డేస్ ఆధారంగా ‘ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు’ అనే ఉత్కంఠభరిత పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌ను ప్రేక్షకులను అందించనుంది. జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో.. రోహిత్ బనవాలికర్, శ్రీరామ్ రాజన్‌తో కలిసి ఈ సిరీస్‌ను రూపొందించారు. గూఢచర్యం, అనిశ్చితమైన వాతావరణం, ఇంటెలిజెన్స్ వైపల్యంతో పాటు న్యాయం కోసం చెల్లించిన భారీ మూల్యం కలబోతగా ఈ సిరీస్‌ను రూపొందించారు. అమిత్ సియాల్ – డి.ఆర్. కార్తికేయన్ (ఎస్.ఐ.టి చీఫ్), సాహిల్ వైద్ – అమిత్ వర్మ (ఎస్.పీ-సీబీఐ), భగవతీ పెరుమాళ్ – రాఘవన్ (డి.ఎస్.పీ-సీబీఐ), డానిష్ ఇక్బాల్ – అమోద్ కాంత్ (డి.ఐ.జి-సీబీఐ), గిరిష్ శర్మ – రాధావినోద్ రాజు (డి.ఐ.జి-సీబీఐ), విద్యుత్ గర్గ్ – కెప్టెన్ రవీంద్రన్ (ఎన్‌ఎస్‌జీ కమాండో), శఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి. సాయి దినేష్, శృతి జయన్, గౌరి మీనన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
అబ్బా.. అబ్బా.. ఏమి వాడకం అయ్యా!
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ శాఖల సోషల్ మీడియా అకౌంట్‌లను నడిపే వాళ్లు కూడా ట్రెండింగ్ అంశాలతోనే తాము చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ముందు వరుసలో నిలుస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్. ఎన్నోసార్లు సినిమా హీరోల వీడియోలతో ట్రాఫిక్ అవేర్‌నెస్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉండే సదరు హ్యాండిల్ తాజాగా కట్ చేసి రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ టీజర్ వచ్చింది. ఆ టీజర్‌తో పాటు గతంలో ప్రభాస్ నటించిన సాహో సినిమాకి సంబంధించిన బైక్ రైడింగ్ క్లిప్‌తో పాటు మిర్చి సినిమాకి సంబంధించిన మరో క్లిప్ ఆడ్ చేసి, బైక్ లేదా కార్ల మీద స్పీడింగ్ వద్దని, నిదానమే ప్రధానమని అర్థం వచ్చేలా ఒక వీడియో కట్ చేశారు. “హలో హలో, బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి డార్లింగ్” అంటూ ప్రభాస్ చెబుతున్న డైలాగ్ అయితే హైలైట్ అవుతోంది. అలాగే, కచ్చితంగా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలని కూడా పోలీసులు చెబుతున్నారు.
అయ్యగారు ‘పరువు’ నిలబెడతారా?
అక్కినేని అఖిల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ అంటే అందరికీ గుర్తు వచ్చేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్‌కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది. ఆ తర్వాత చేసిన ఏజెంట్ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అఖిల్ సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు ఇటీవల ఒక ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశాడు. లెనిన్ పేరుతో ఈ సినిమాను మురళీకృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేసిన ఆయన, ఈ సినిమాను కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నాడు. అఖిల్ లెనిన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ బాగుంది. అఖిల్‌కు మరో హిట్ దొరుకుతుందేమో అని ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తించింది. ఇప్పుడే అఖిల్‌కు పెళ్లి జరిగినందున, ప్రస్తుతానికి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే, ఈ సినిమా ఒక సున్నితమైన (సెన్సిటివ్) ఇష్యూను టచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమా పరువు హత్యల నేపథ్యంలో రాసుకున్న కథగా సమాచారం.