సూర్యలంక బీచ్ కి మహర్దశ వచ్చేసింది.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.
ప్రియురాలి హత్యకు ఓ న్యాయవాది ప్రయత్నించిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది.. న్యాయవాది అన్వర్ తన కారుతో బీభత్సం సృష్టించాడు.. తన ప్రియురాలు నసీమాపై హత్యాయత్నం చేశాడు.. ఆమె ప్రయాణిస్తున్న కారును తన కారుతో ఢీకొట్టిన అన్వర్.. కారుతో గుద్ది చంపేయాలని ప్రయత్నించాడు.. ఇక, ఆ తర్వాత అదే రోడ్డులో ఉన్న మరిన్ని వాహనాలను కూడా ఢీ కొట్టి వెళ్లిపోయాడు..
బిక్కవోలులో పలువురు వైసీపీ ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేసి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.. ఈ సందర్భంగా వారికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీపీ ఎన్నికల్లో తొస్సిపూడి ఎంపీటీసీ సభ్యురాలు తేతలి సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, పెనుగొండ గ్రామాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. తమ కుటుంబ మూలాలున్న గ్రామాల అభివృద్దికోసం అవసరమైన మౌలికవసతుల కల్పనపై దృష్టి సారించారు.. అక్కడి సమస్యలను పేషీ అధికారుల ద్వారా తెలుసుకొనున్నారు. ఈనెల 28వ తేదీన పవన్ పేషీ అధికారులు అయా గ్రామాల్లో పర్యటించనున్నారు..
పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసింది.. ఆ తర్వాత ప్రవీణ్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు.. దీంతో, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుండి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్‌బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు.. అయితే, రాజమండ్రి ఆస్పత్రికి వచ్చిన కేఏ పాల్.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు..
అటవీశాఖ అధికారులు చేసిన పని టీటీడీకి తలనొప్పిగా మారింది. పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో అటవీశాఖ అధికారులు పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ కి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణులను రప్పించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు.
భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.. భీమిలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు..