YS Jagan: కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా..? ఎందుకీ కక్ష..?
- మా పార్టీలో ‘కమ్మ’ కులస్తులపై ఎందుకీ కక్ష..?..
- కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా?..
- సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలను నిలదీసిన జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మా పార్టీలో ‘కమ్మ’ కులస్తులపై ఎందుకీ కక్ష..?.. కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా? అని సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలను నిలదీశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనలో రెంటపాళ్ళలో పర్యటించిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. వైసీపీ నేత నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏం పాపం చేశారని మా పార్టీలోని కాపు నేతలను ఇబ్బంది పెడుతున్నారు..? అని మండిపడ్డారు.. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇన్ని రోజులుజైల్లో పెట్టారు.. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో జైలుకు పంపిస్తున్నారు.. ఏం పాపం చేశారని కొడాలి నానిని హెరాస్ చేస్తున్నారు.. దెందులూరు కు చెందిన అబ్బయ్యచౌదరిపై తొమ్మిది కేసులు పెట్టారు.. దేవినేని అవినాష్ కమ్మ సామాజిక వర్గంవాడని కేసులమీద కేసులుపెట్టి హింసిస్తున్నారు.. తలశిల రఘురాం ఎమ్మెల్సీ పై ఏం చేశారని మూడు కేసులు పెట్టారు.. ఎంవీవీ సత్యనారాయణ మాజీ ఎంపీని వ్యాపారాలు చేసే అవకాశం లెకుండా చేశారు.. నంబూరు శంకరరావు మాజీ ఎమ్మెల్యే పై తప్పుడు కేసులు పెట్టారు.. బొల్లా బ్రహ్మనాయుడు, శివకుమార్ పై తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు వైఎస్ జగన్..
Read Also: TGSRTC: ఆర్టీసీ తొలి మహిళా కండక్టర్లు వీరే.. 28 ఏళ్ల ఉత్తమ సర్వీసుకు సన్మానం..!
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
శివకుమార్ కాలేజీకి ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదు.. పోసాని మా పార్టీ సానుభూతి పరుడని నెలరోజులు జైల్లో పెట్టారు.. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ కు చెందిన భూమిని వెనక్కి తీసుకున్నారని విమర్శించారు వైఎస్ జగన్.. మంగళగిరికి చెందిన రాజ్ కుమార్ కమ్మ, పాలేటి కృష్ణవేణిని పెళ్ళి చేసుకున్నాడు.. రాజ్ కుమార్ ను మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారు.. ఇంటూరు రవికిరణ్ పై పంతొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు అని మండిపడ్డారు.. కమ్మవారంటే నీకు ఊడిగం చెయ్యాలా? మీరు దోచుకునేందుకు… మీ అన్యాయాలను వేలెత్తి చూపిస్తే వేధిస్తారా? చంద్రబాబు ను వ్యతిరేకిస్తే వేధింపులే.. ఒక్కటే చెబుతున్నా.. రేపు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, రాష్ట్రంలో జరుగుతున్నవాటిపై మాట్లాడుతా.. చంద్రబాబు, వారికి వత్తాసు పలుకుతున్న వారికి చెబుతున్నా.. రేపు మా ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తా.. మీరు తప్పుల్లో భాగస్వామ్యం కావవద్దు.. మిమ్మల్నికూడా బోనెక్కుస్తా.. నాగమల్లేశ్వరావు తండ్రి వెంకటేశ్వర్లు కేసుపెట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని వ్యాఖ్యానించారు మాజీ సీఎం వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!