నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. పోలీసులు కేసు పెట్టారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.
రాజధాని అమరావతి పునఃనిర్మాణం వైపు వేగంగా అడుగుల వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీ లాంచ్ కార్యక్రమానికి వస్తారని తెలిపారు మంత్రి నారాయణ.. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారన్నారు.. రాజధాని ప్రాంతంలో సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.. నిర్మాణంలో ఉన్న భవనాలు 115 కాగా.. సెక్రటరీలకు 90, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు 25 నిర్మాణాలు ఉన్నాయి.. 18 నెలల కాలంలో…
కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది.. వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు జరగనుంది.. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధ
ఉద్యోగులకు తీపికబురు.. ఖాతాల్లో జమ అవుతోన్న నిధులు.. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. దాదాపు 6,200 కోట్ల రూపాయాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. GLI, […]
వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు జరగనుంది.. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది.. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పధకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పి.ఫోర్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చ జరగనుంది..
ఎండల తీవ్రత దృష్ట్యా.. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు.. ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు వీలుగా స్కూళ్లలో వాటర్ బెల్ మోగించాలని తెలిపారు..
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.. ఆందోళన చెందవద్దు అన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆయన.. నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు.. అయితే, గతంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు..
డీలిమిటేషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి డీలిమిటేషన్ వల్ల నష్టం కలుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రానికి లేఖ రాయడం సంతోషం అన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. డీలిమిటేషన్పై పార్లమెంటులో మాట్లాడాలనడం గోడ మీద పిల్లి వాటం అంటూ ఎద్దేవా చేశారు.. బీజేపీని కాదనలేక సర్కస్ ఫీట్లు వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదన్నారు.
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. దాదాపు 6,200 కోట్ల రూపాయాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.
వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. వేసవి కారణంగా నీటి ఎద్దటి సమస్య, వడగాల్పులు, ఎండల ప్రభావం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించారు సీఎం