అధికారం పోయాక కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి అన్నా చెల్లెళ్ళ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడ్డట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. తనకు పార్టీలో సరైన ఆదరణ లభించడంలేదని కుంగిపోయిన కవిత ఇటీవల తండ్రికి రాసిన లేఖ సంచలనం సృష్టించింది. అందులోని అంశాలతో పాటు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ఇంకా కలకలంరేపాయి. కేసీఆర్ దగ్గర కోవర్ట్‌లు ఉన్నారని, ఆయన దేవుడేగానీ... చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత లెటర్లో రాసిన అంశాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ అరాచకాలు ఏంటి? మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా? అని మండిపడ్డ ఆయన.. దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోండి అంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..
తెలంగాణ కేబినెట్ విస్తరణలో కచ్చితంగా అవకాశం దక్కి తీరుతుందని అనుకున్న వాళ్ళు ఐదుగురు. అవకాశం దక్కింది ముగ్గురికి. కానీ... ఈ ఆశించిన ఐదుగురిలో ఎవరూ ఆ ముగ్గురిలో లేరు. దీంతో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వాళ్ళంతా... తాత్కాలికంగా సైలెంట్ అయ్యారా..? వాళ్ళకు ఏ పదవులు ఇచ్చి నచ్చచెప్తారంటూ తెగ గుసగుసలాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి కొద్ది కాలంగా... తెలంగాణ బీజేపీకి మింగుడుపడనట్టుగానే ఉంటోంది. పార్టీ నేతల మీద తిట్ల దండకాలు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి మీద మిమర్శల్లాంటివి బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం. అయితే.... ఆయన డైరెక్ట్‌గా విమర్శిస్తున్నా, సోషల్ మీడియా మెసేజ్‌లు పెడుతున్నా... కమలం నేతలు ఎవ్వరూ స్పందించడం లేదు. ఎవరైనా అడిగితే కూడా....అది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అంటూ దాటేస్తున్నారు. అదే సమయంలో అటు రాజాసింగ్ కూడా ఎక్కడా తగ్గడం లేదు.
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది చాలా కీలక పాత్ర.. పాలసీ మేకింగ్, వాగ్దానాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ అన్నిటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కూటమిలో జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది.. ప్రజలకోసం కూటమికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్..
విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ రోజు విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం ఎయిర్పోర్ట్) టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ లో కొత్త నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... AP PPC అనే కంపెనీ ఏర్పాటు చేసి, ఆక్వా రైతులకు, ఆక్వా కంపెనీలకు కావాల్సిన అన్ని సేవలు అందించనుంది.. అలాగే, ఫీడ్ ధరలో 14 రూపాయలు MRP మీద అందరికీ సమానంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. విద్యుత్ టారిఫ్ తగ్గించడం ద్వారా ఆక్వా రైతులకు భారం తగ్గించాలని నిర్ణయించారు.. స్ధానిక మార్కెట్‌ను పెంచడానికి, రొయ్యల వినియోగం పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుంది.. APPPC కోసం ఒక వెబ్…
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.
ఏపీ రెరాలో రిజిస్టర్ కాని ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు ఆంధ్ర ప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఛైర్పర్సన్ సురేష్ కుమార్..